రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం.

 *- రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం* 


 *- "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" తో ప్రజల్లోకి వెళ్తున్నాం* 

 *- గుడివాడ నియోజకవర్గంలో అనూహ్య స్పందన* 

 *- మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 


గుడివాడ, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం 24వ వార్డులో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని అరవపేటలో ఇంటింటికీ తిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపుమేరకు "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న కష్టనష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. అన్నివర్గాల ప్రజల నుండి "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ప్రభుత్వ వ్యతిరేకత కనబరుస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని రావి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, గోవాడ శివ, శొంఠి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, పొట్లూరి వెంకట కృష్ణారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పండ్రాజు సాంబశివరావు, పోలాసి ఉమామహేశ్వరరావు, జానీ షరీఫ్, యార్లగడ్డ సుధారాణి, గొర్ల శ్రీలక్ష్మి, అసిలేటి నిర్మల, తులసీరాణి, ఎం ఇస్సాక్, కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments