రానున్న రోజుల్లో మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఎక్స్ పోర్ట్ ధాన్యం రకాలపై రైతుల్లో అవగాహన కల్పించి, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ధాన్యం కొనుగోలులో  రైతుల ఇబ్బందులు నివారించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లుపై మరియు సేకరించిన ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో తీసుకోవాల్సిన చర్యలపై  వ్యవసాయ, పౌర సరఫరాలు, ఎఫ్.సి.ఐ., ఎక్స్పోర్ట్ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో  వర్చువల్ గా జరిగిన సమన్వయ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  గురువారం సాయంత్రం నెల్లూరు లోని మంత్రి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు.


మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ,  రానున్న రోజుల్లో మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఎక్స్ పోర్ట్  ధాన్యం రకాలపై రైతుల్లో అవగాహన కల్పించి,  రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాల


ని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.  పంట సాగుకు ముందే  మార్కెట్ డిమాండ్  ధాన్యం రకాల పై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా వచ్చే  సీజన్లో మార్కెట్ డిమాండ్ గల ధాన్యం రకాలపై  రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర  కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని  కేరళ రాష్ట్రం,ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని  మంత్రి సూచించారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శ్రీ మధుసూదన్ రెడ్డి,  కమిషనర్ శ్రీ అరుణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ ఎం.డి శ్రీ వీరపాండ్యన్, ఎఫ్.సి.ఐ, ఎక్స్పోర్ట్  శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments