లింగ వివక్షతపై అవగాహన



రాజమండ్రి (రూరల్) (ప్రజా అమరావతి); మండల మహిళా సమాఖ్య కార్యక్రమములో లింగ వివక్షత కు  వ్యతిరేకంగా ఎస్ హెచ్ జీ  సభ్యులు, యువతకు  ఆడ పిల్లల అక్రమ రవాణా అరికట్టడం, ఆడ మగ పిల్లల పెంపకములో తేడా, బాల్య వివాహాలు, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, గృహహింస మొదలగు అంశాలపై లింగ వివక్షతపై అవగాహన


కల్పించి జిల్లా స్థాయిలో ర్యాలీ, రంగోలి,  ప్రతిజ్ఞ లను తూర్పుగోదావరి జిల్లా శ్రీమతి యస్.సుభాషిణి, ప్రొజెక్ట్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఎ – వై.యస్.ఆర్.కె.పి.  ఆధ్వర్యంలో శుక్రవారం జరిపించడమైనది.



ప్రతి మండల సమాఖ్య పరిధిలో మండల రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేసి మహిళలకు జరిగిన అన్యాయాలు జెండర్ సోషల్ యాక్షన్ కమిటీ ద్వారా పరిష్కారం జరిగే విధముగా ప్రయత్నం చేయాలని ప్రొజెక్ట్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఎ – వై.యస్.ఆర్.కె.పి. వారు మహిళలు అందరికి తెలియ జేయడమైనది.


కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు.



ఈ కార్యక్రమములో మేకల వెంకట శేషమ్మ, అడ్వకేట్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధారిటీ వారు పేద మహిళలకు ఉచితంగా న్యాయసేవలు అందించటానికి సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమము చేపట్టడం జరిగినదని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధారిటీ  తెలియజేశారు. ఈ కార్యక్రమములో  డి.ఆర్.డి.ఎ – వై.యస్.ఆర్.కె.పి.  లైన్ డిపార్ట్మెంట్స్ పాల్గొనడం జరిగినది.





Comments