భవిష్యత్ లో వ్యవసాయ-ఆహార విధానాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది



విజయవాడ (ప్రజా అమరావతి);



*సుస్థిర వ్యవసాయాభివృద్ధికి పర్యవేక్షణ & మూల్యాంకనంపై వర్క్ షాపు*...


భవిష్యత్ లో వ్యవసాయ-ఆహార విధానాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంద


ని ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గెడ్డం శేఖర్ బాబు తెలిపారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) సహకారంతో బుధవారం విజయవాడంలోని మురళీ ఫార్చూన్ హోటల్ నందు వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో శిక్షణ పొందిన మాష్టర్ ట్రైనర్లకు డాక్టర్ వైఎస్సార్ పొలంబడి మరియు మేలైన యాజమాన్య పద్దతులపై ‘పర్యవేక్షణ మరియు మూల్యాంకనం’ (Monitoring & Evaluation) అనే అంశంపై ఒక రోజు వర్క్ షాపును ఆయన ప్రారంభించారు. ఈ వర్క్ షాపునందు వ్యవసాయ, ఉద్యాన, విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధృవీకరణ సంస్థల మాష్టర్ ట్రైనర్లతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గెడ్డం శేఖర్ బాబు  ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కొరకు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని రకాలైన సేవలను గడపవద్దనే అందించడంతో పాటు ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ బుకింగ్, వడ్డీ లేని పంట రుణాలు మొదలైన కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. వ్వవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆర్బీకేల ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతదేశమంతా అనుసరిస్తుందని తెలిపారు. ఏపీ రైతులు పొలంబడి వంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదన్నారు. రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశ్యంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మంచి పద్దతులతో పండించిన పంటలకు మార్కెటింగ్ లో చాలా ప్రాధాన్యత ఉంటుందని శేఖర్ బాబు తెలిపారు.

ఆహార మరియు వ్యవసాయ సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ చావా కొండారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత ఫుడ్, ఫీడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫైనాన్స్ వంటి 5ఎఫ్ సంక్షోభాలలో ప్రపంచదేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం మాత్రం అభివృద్ది దిశగా అడుగులు వేసిందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం రంగంలో అదీ ఆంధ్రప్రదేశ్ లో సానుకూల వ్యవసాయ రాబడులు, అభివృద్ధి సాధించిందన్నారు. విత్తనం నుండి పంట విక్రయం వరకూ  రైతులకు సేవలందిస్తున్న ఆర్బీకే తరహా వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ర సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా Monitoring & Evaluation వర్క్ షాపు ఉద్దేశ్యాన్ని, ప్రాధాన్యతను సభ్యులకు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. డాక్టర్ వైఎస్సార్ పొలంబడిలో మేలైన యాజమాన్య పద్దుతులను పర్యవేక్షించి మూల్యాంకనం చేయుటకు అనుసరించాల్సిన విధానాలను తెలియజేశారు. 

ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. త్రివిక్రమ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ఉత్పత్తులకు మంచి ధర లభించుటకు, జీఏపీ సర్టిఫికేషన్ యొక్క ప్రాధాన్యతను వివరించారు.

ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రంలో 2000 కు పైగా వైఎస్సార్ తోటబడులు నిర్వహించామని, తద్వారా అరటి, మిరప, పసుపు పంటలలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్దుతులపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ వలన పై పంటల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు.

ఆర్బీకే సంయుక్త సంచాలకులు వి. శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఆర్బీకే పరిధిలో డాక్టర్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమాన్ని శాస్త్రీయంగా నిర్వహిస్తున్నామన్నారు. పొలంబడి ద్వారా రైతులకు మేలైన యాజమాన్య పద్దతులపై సమగ్ర అవగాహన కల్పించుట ద్వారా రైతు పండించిన ఉత్పత్తులకు మంచి ధర పలుకుతుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో FAO ఫ్రతినిధులు సుధాకర్, నచికేత్, పొలంబడి ఉప సంచాలకులు బాలు నాయక్, విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. 



Comments