తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలి



నెల్లూరు, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి): తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాల


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

 శుక్రవారం ఉదయం ముత్తుకూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలనే లక్ష్యంతో  ట్యాబ్ ల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా విద్యార్థులు అన్ని సమయాల్లో ఉపయోగించుకునేలా బైజుస్ కంటెంట్ తో ట్యాబ్ ను రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులకు ఏం కావాలో ముందుగా తెలుసుకుని, ఆ మేరకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సమకూరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లినా మన విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలనుస్తుందని, విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుంటూ తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు.  నాడు నేడు పనులతో పాఠశాలల రూపు రేఖలు మార్చిన ముఖ్యమంత్రి, అమ్మ ఒడి పథకంతో తల్లిదండ్రులక్షకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ముత్తుకూరు మండలంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన 627 ట్యాబ్లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద రూ. 10 కోట్ల విలువైన 3130 ట్యాబ్ లను అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు  బైజుస్ కంటెంట్ తో రూపొందించిన ట్యాబ్ లను పంపిణీ చేశారు. జగనన్న క్రీడా సంబరాల్లో విజేతలైన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించారు. 


తొలుత జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నాడు-నేడు పథకంలో భాగంగా రూ. 1.92 కోట్ల అంచనాతో 16 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

  

 ఈ కార్యక్రమంలో  ఎంపీపీ గండవరం సుగుణమ్మ, జడ్పిటిసి వెంకట సుబ్బయ్య, ఎంపీడీవో ప్రత్యూష, తాసిల్దార్ మనోహర్ బాబు, ఎంఈఓ మధుసూదన్, హెచ్ఎం చెంచురామయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments