గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించిన బైపాస్ లైన్ ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

 పి.ఆర్ .నె౦. 742                             తేదీ : 02 డిసెంబర్   


గుత్తి  రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించిన  బైపాస్ లైన్ ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే   రూ. 43 కోట్లతో 3.2 కిలోమీటర్ల దూరం కొత్త బైపాస్ లైన్ నిర్మాణం .

  గుత్తి  స్టేషన్‌లో బైపాస్ లైన్ ఏర్పాటు చేయడం వల్ల గుత్తి  - ధర్మవరం & గుత్తి  - రేణిగుంట లైన్ల మధ్య రైలు రాకపోకలు ఇక  సులభతరం .


దక్షిణ మధ్య రైల్వే ఇటీవలి కాలంలో అనేక ట్రాఫిక్  సౌకర్యాలను  మెరుగుపరచడం ద్వారా   ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్లను సజావుగా , సులభంగా నిర్వహించడానికి   చర్యలు చేపట్టింది .  ఈ క్రమంలో  రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రధాన జంక్షన్ల వద్ద చేపట్టిన కీలక పనుల్లో బైపాస్ లైన్ల నిర్మాణం ఒకటి.    గుత్తి  జంక్షన్‌లో 3.2 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ  బైపాస్‌లైన్‌ను రూ.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు.  గుత్తి   - ధర్మవరం ప్రధాన రైలు మార్గము తో   గుత్తి - రేణిగుంట ప్రధాన రైలు మార్గాన్ని కలుపుతూ గుత్తి  జంక్షన్‌కు  వెళ్లనవసరం లేకుండా  ఈ లైన్  నిర్మించబడింది.


 ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో   గుత్తి  స్టేషన్ ఒక  ముఖ్యమైన జంక్షన్.  ఈ జంక్షన్ నుండి     బెంగళూరు, రేణిగుంట, డోన్ , గుంతకల్, వాడి వైపు   ప్రయాణికుల రైళ్లతో పాటు సరకు రవాణా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి .     దక్షిణం వైపు నుండి అంటే ధర్మవరం నుండి రేణిగుంట వైపు వెళ్లే రైళ్లు ఖచ్చితంగా గుత్తి స్టేషన్‌లో ఇంజన్ రివర్సల్ జరగాలి , తద్వారా స్టేషన్‌లో రైలును నిలుపుదల చేయాల్సి  ఉంటుంది.  కాబట్టి ఈ సమస్యను  అధిగమించేందుకు సుమారు రూ.43 కోట్ల  నిధులతో   గుత్తి లో బైపాస్‌ లైన్‌ నిర్మాణం కొరకు మంజూరైంది .

 

 ఇదివరకే సరికొత్త ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్  వ్యవస్థతో  గుత్తి  దక్షిణం వద్ద  క్యాబిన్  మరియు గుత్తి  జంక్షన్ వద్ద   మరో క్యాబిన్‌ ఉన్నాయి.  నూతనంగా  నిర్మించిన బైపాస్ లైన్ జంక్షన్ క్యాబిన్ దగ్గర మొదలవుతుంది .    గుత్తి  జంక్షన్  క్యాబిన్‌ ఇప్పుడు గుత్తి జంక్షన్ బై పాస్  క్యాబిన్ గా వ్యవహరించబడుతుంది .  దీనికి అనుగుణంగా  ఈ క్యాబిన్ వద్ద ఈ .ఐ ( ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ )  వ్యవస్థను  మార్పు చేసి  ఇప్పటికే ఉన్న మార్గాలతో అనుసంధానించబడింది.  బైపాస్ లైన్ గుత్తి  టౌన్ ప్రక్కనే ఉంది . కావున రైలు ప్రయాణికుల   రాకపోకలను సులభతరం చేయడానికి హై లెవల్ ప్లాట్‌ఫారమ్‌తో   అదనపు హాల్ట్ స్టేషన్ నిర్మించబడింది.


ఈ  కొత్త బైపాస్ లైన్‌ను ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలు:


 • ధర్మవరం వైపు నుండి రేణిగుంట వైపు మరియు అలాగే ఇరు వైపులా   నిరంతరాయంగా ఇబ్బందులులేని    రైలు రాకపోకలు  సాగించేందుకు ఇది ఎంతో సౌలభ్యం .

 • సరుకు రవాణా రైళ్లు ఇప్పుడు సౌకర్యవంతంగా బైపాస్ లైన్ ద్వారా ప్రయాణించేందుకు వీలుపడ్తుంది అలాగే ఇతర రైళ్లకు    కలిగే ఇబ్బందులను తగ్గించడం ద్వారా సెక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.


 • రైళ్ల సగటు వేగం  పెంచేందుకు ఇది దారితీస్తుంది.

 •  దీని ద్వారా రవాణా వ్యవస్థ వృద్ధితో  పాటు   రోలింగ్ స్టాక్ ( కోచ్ లు మరియు వ్యాగన్ ల  )  వినియోగాన్ని  మెరుగుపరుస్తుంది .


 ఈ కీలకమైన బైపాస్ లైన్‌ను అవసరమైన   మార్పులతో సకాలంలో  పూర్తి చేయడంలో పాలుపంచుకున్న నిర్మాణ సంస్థను మరియు  దక్షిణ మధ్య రైల్వే  అధికారులను ,సిబ్బందిని  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  అరుణ్ కుమార్ జైన్ గారు  అభినందించారు.  గుత్తిలో   బైపాస్‌ లైన్‌ నిర్మాణం వల్ల రైళ్ల నిర్వహణ మెరుగుపడటంతో పాటు రాకపోకలు సులభతరం అవుతాయని ఆయన తెలిపారు .  ఇది ముఖ్యంగా కడప మరియు నెల్లూరు జిల్లాల్లో ఉన్న  థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ సైడింగ్‌లు, ఓడరేవుల వైపు  సరుకు రవాణా రైళ్ల రాకపోకలను కూడా సులభతరం చేస్తుందని అయన పేర్కొన్నారు . Comments