సి.బి.ఆర్.ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా.. తీర్చిదిద్దుతాం*సి.బి.ఆర్.ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా.. తీర్చిదిద్దుతాం


*


* *పార్ణపల్లె పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


* *రూ.5.60 కోట్ల పాడా నిధులతో అభివృద్ధి చేసిన పర్యాటక భవనాలు, బోటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి*


* *రిజర్వాయర్ లో బోటు షికారు చేసిన ముఖ్యమంత్రి*


సి.బి.ఆర్., డిసెంబర్ 2 (ప్రజా అమరావతి): పులివెందుల నియోజకవర్గం  పార్ణపల్లెలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సి.బి.ఆర్.) ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి.. హెలికాప్టర్ ద్వారా లింగాల మండలం పార్ణపల్లె పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకుని.. అక్కడ పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా.. రూ.4.1 కోట్ల పాడా నిధులతో అధునాతనంగా నిర్మించిన వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కుతో పాటు.. రూ.1.5 కోట్ల పాడా నిధులతో ఏర్పాటు చేసిన 4 సీట్ల స్పీడ్ బోట్, 18 సీట్ల ఫ్లోటింగ్ జెట్టీ పర్యాటక బోటింగ్ సిస్టమ్ కు సంబంధించిన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతేకాకుండా లేక్ వ్యూ పార్కులో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 


అనంతరం వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ లో పర్యాటకుల కోసం అధునాతనంగా నిర్మించిన అతిథి గృహాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి.. అక్కడే  కొద్దిసేపు సేపు లేక్ వ్యూ పాయింట్ లోనుండి రిజర్వాయర్ లో జలకలను, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకిస్తూ.. అక్కడి పిల్ల గాలులను ఆస్వాదిస్తూ కొద్దీసేపు సేద తీరారు.


అంతకు ముందుగా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాంటున్ బోటులో కూర్చుని రిజర్వాయర్ జలాల్లో ముఖ్యమంత్రి కొద్దిసేపు షికారు చేశారు. 


ఈ సందర్బంగా... ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దెందుకు.. ఈ ప్రాంతం ఎంతో అనువైనదని, ఇక్కడ అన్ని రకాల వనరులు సమృద్ధిగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా.. పర్యాటక శాఖ ద్వారా సి.బి.ఆర్. ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు.. ముఖ్యమంత్రి ఓఎస్డీలు దనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, జేసీ సాయికాంత్ వర్మ, శిక్షణా కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ కేకే ఎన్ అన్బురాజన్, అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ ప్రేరణ కుమార్, పాడా ఓఎస్సీ అనికుమార్ రెడ్డి,  పులివెందుల ఆర్డీవో వెంకటేశ్వర్లు, పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు. 


సీబీఆర్ హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, వైసీపీ నేతలు నైరుతి రెడ్డి, రామసుబ్బా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. 


** *ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన ముఖ్యమంత్రి..*


వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ లో జిల్లా నీటి పారుదల శాఖ వారు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిలకించారు.  ఈ సందర్భంగా.. జిల్లాలోని మేజర్ రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, వాటి సామర్థ్యంకు సంబందించినఖ్ వివరాలను ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


** *శనివారం వివాహ వేడుకకు హాజరు కానున్న ముఖ్యమంత్రి*


శనివారం ఉదయం పులివెందులలోని ఎస్సీఎస్ఆర్ కల్యాణ మండపంలో.. తన వ్యక్తిగత కార్యదర్శి రవిశంకర్ యాదవ్ కుమార్తె వివాహ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.Comments