రవాణా చార్జీల కోసం తెలుసా?*రవాణా చార్జీల కోసం తెలుసా?పార్వతీపురం/పాలకొండ, డిసెంబరు 2 (ప్రజా అమరావతి): రైతులకు రవాణా, గోనె సంచుల ధరలు చెళ్లుస్తుందని మీకు తెలుసా అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రైతులను అడిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుల వరకు రైతు రవాణా చేస్తే ఆ చార్జీలను ప్రభుత్వం చెల్లుస్తుందని ఆయన తెలిపారు. పాలకొండ మండలం తుమరాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు, ధాన్యం తూకం, ధాన్యం లోడింగ్, ఆన్ లైన్ నమోదు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లోడింగ్ చేస్తున్న లారీల వద్దకు స్వయంగా వెళ్లి దాని పరిస్థితిని పరిశీలించారు. ప్రతి ఒక్క ధాన్యం గింజ కొనవలసిందేనని అధికారులను.  దళారి విధానాన్ని పూర్తిగా అరికట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్మరాదని ఆయన పేర్కొన్నారు. మద్ధతు ధర కంటే తక్కువకు ఎవరు కోనుగోలు చేయకొండ చూడాలని అధికారులకు సూచించారు. రైతులతో మాట్లాడుతూ గన్ని బ్యాగ్స్ కి ప్రభుత్వం రూ.3.39 పైసలు చెల్లిస్తుందని అ విషయం అధికారులు మీకు తెలియజేసారా అని ఆరా తీశారు. గన్ని బ్యాగ్స్, రవాణా చార్జీలు గూర్చి అధికారులు ఎప్పటి కప్పుడు విస్తృత ప్రచారం చెయ్యాలని ఆదేశించారు. కరపత్రాలు పంపిణీ చేయాలని ఆయన చెప్పారు. రైతుల ధాన్యం కొనుగోలు నిబంధనలకు అనుగుణముగా  కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన తరువాత రైస్ మిల్లులకు తరలించడానికి అయ్యే రవాణా చార్జీలు రైతులు భరిస్తే దానిని చెల్లిస్తామని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మద్దతు ధరతో పాటు రైతు ఖాతాలో జమ చేస్తామని ఆయన చెప్పారు. 


పార్వతీపురం డివిజన్ లో 8 కిలో మీటర్ల వరకు ఒక మెట్రిక్ టన్నుకు రూ. 295 లు, పాలకొండ  డివిజన్ లో మూడు వందల రూపాయలు స్లాబ్ ధర చెల్లించడం జరుగుతుందని ఆయన అన్నారు. 8 నుండి 20 కిలో మీటర్లు వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు ఒక మెట్రిక్ టన్నుకు 7 రూపాయలు,   20 నుండి 40 కిలో మీటర్ల వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 6.50 రూపాయలు, 40 నుండి 80 కిలో మీటర్లు వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 6 రూపాయలు,  80 కిలో మీటర్లు పైబడి ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 5.50 రూపాయలు చెల్లించడం జరుగుతుందని ఆయన వివరించారు.  


వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి రైతులకు కొనుగోలు ప్రక్రియపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. రైతులకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలని, ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు లేకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని అధికారులకు ఆదేశించారు.

అంతకుముందు పాలకొండ యూనియన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. దేవుళ్ల నాయక్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Comments