ఎనిమిదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబులను పంపిణీ చేయడం జరుగుతోoది

 అమలాపురం డిసెంబర్ 21 (ప్రజా అమరావతి/: దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ అందరూ చదువులు అభ్యసించాలన్న ఆశయాలకు అనుగుణంగా 8వ తరగతి విద్యార్థులకు ఎనిమిదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబులను పంపిణీ చేయడం జరుగుతోoద


ని రాష్ట్ర రవాణా శాఖ పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యుల జన్మదినాన్ని పురస్కరించుకుని. డిజిటల్ విద్య లో భాగంగా విద్యాశాఖ ఆధ్వ ర్యంలో  ట్యాబులు ఉచిత  పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరంలో సీబీఎస్సీ విధానంలో ఇంగ్లీష్ మాధ్యమంలో పదో తరగతి పరీక్షలు రాసేలా పిల్లలను  రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్న చర్యలో భాగంగా 24 గంటలు విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి వీలుగా కేవలం స్థితి మంతుల పిల్లలకే  కాకుండా రాష్ట్రంలో ఎని మిదో తరగతి చదువుతున్న ఉన్న పిల్లలందరికీ ముఖ్యమంత్రివర్యులు పుట్టినరోజు కానుకగా టాబ్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేద విద్యా ర్థులను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దే లా డిజిటల్ విధానంలో పాఠ్యాంశా లు అర్ధమయ్యేలా మెరుగైన చదువులు దిశగా ఇకపై ప్రతి సంవ త్సరం బైజుస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకొని పంపిణీ చేయడం  జరిగిందన్నారు.  జిల్లావ్యాప్తంగా ఎనిమిదో తరగతి విద్యను అభ్యసించుచున్న 14,561 మంది విద్యార్థులకు, 8వ తరగతి పాఠ్యాంశాలు బోధించే 1,944 మంది ఉపాధ్యాయులకు  వెరసి రూ 54.05 కోట్ల విలువగల ట్యా బులను అందించడం జరుగు తుందన్నారు సుమారుగా ఒక్కొక్క ట్యాబ్ విలువ రూ.32 వేలు వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారన్నారు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రివర్యులు జన్మదిన పురస్కరించుకుని గత వారం రోజులుగా జగనన్న క్రీడా సంబరాలు పేరిట పోటీలు నిర్వహించిన తో పాటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మానసిక శారీరక దృఢత్వానికి ఈ పోటీలు దోహదపడ్డాయి అన్నారు. స్థానిక ప్రాంతీయ హాస్పిటల్ నందు చిన్నారుల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని జిల్లా సత్వర వైద్య సేవ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిం దన్నారు. అదేవిధంగా ప్రాంతీయ ఆసుపత్రి నందు ప్లేట్లెట్స్ ఎక్కించు కునే యంత్ర పరికరాన్ని రిలయన్స్ వారి సహకారంతో నెలకొల్పడం సంతోష దాయకమన్నారు గతంలో ఇదే చికిత్సకు కాకినాడ రాజమండ్రి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉండేదని ఇప్పుడు ఆ సేవలు స్థానికంగా అందుబాటులో రావడం శుభదా యకమన్నారు  జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి రవి సాగర్ మాట్లా డుతూ వారం రోజులపాటు విద్యార్థిని విద్యా ర్థులు,టీచర్లకు  ట్యాబ్‌లు ఇవ్వనున్నామన్నారు  వీటిలో బైజూస్ లెర్నింగ్ యాప్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు 8 భాషల్లో ఉంటా యన్నారు విద్యా బోధన సులభ తరం చేసేందుకు సత్వరమే వివిధ రకాల విషయాలు తెలుసుకునేం దుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెం పొందించే చర్యల్లో భాగంగా ఈ ట్యాబ్లు ఉపయోగపడతాయన్నారు రాబోయే రోజుల్లో ఆన్లైన్ విద్య విధానానికి ఈ ట్యాబు లు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకే షనల్ ఆఫీసర్ సాలెం రాజు ఎంఈఓ జి ప్రకాశం ఎంపీపీ భాగ్యలక్ష్మి మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు ఆహార భద్రత కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ , దృశ్యకళల అకాడమీ చైర్మన్ కే సత్య శైలజ, హితకారిణి సమాజం అధ్యక్షులు కే మునుకుమారి,సీఎంఓ, బి వి సుబ్రహ్మ ణ్యం సిఆర్పి శ్రీను బాబు, హెచ్ఎం ఎస్ఎల్వీ బాల. తదితరులు పాల్గొన్నారు.

Comments