జిల్లాలో అర్హులైన 10,781 మంది షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10.78 కోట్ల లబ్ధి.

 మూడవ విడత జగనన్న చేదోడు పథకం ప్రారంభం


జిల్లాలో అర్హులైన 10,781 మంది షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10.78 కోట్ల లబ్ధి. జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్..


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 30 (ప్రజా అమరావతి):


పల్నాడు జిల్లా వినుకొండ నుంచి సోమవారం వరుసగా మూడవ ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించి అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.


పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి, పూడా చైర్మన్  లక్ష్మీ నరసమ్మ, బిసి కార్పొరేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


శ్రీ సత్యసాయి జిల్లాలో అర్హులైన 10,781 మంది షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10.78 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్..


శ్రీ సత్యసాయి జిల్లాలో అర్హులైన 10,781 మంది  షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10.78 కోట్ల లబ్ధి కలగడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పేర్కొన్నారు. అందులో 5,624 మంది షాపులున్న రజకులకు రూ.5.62 కోట్ల రూపాయల లబ్ధి కలిగిందని, 1,839 మంది షాపులున్న రజకులకు రూ.1.83 కోట్లు, 3,318 మంది షాపులున్న టైలర్లకు 3.31 కోట్ల రూపాయల లబ్ధి కలగడం జరిగిందని తెలిపారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం దారిద్య్ర్యరేఖకు దిగువన నివసిస్తున్న వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగడానికి, షాపులున్న రజకులు, షాపులున్న నాయీబ్రాహ్మణులు మరియు టైలరింగ్ వృత్తి చేయు పాపులున్న అన్ని కులముల వారికి సంవత్సరానికి 10 వేల రూపాయల చొప్పున, ఐదు సంవత్సరములకు 50 వేల రూపాయల ఆర్థికస హాయం మంజూరు చేయడం జగనన్న చేదుడు పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరములో మొదటి విడతగా జిల్లాలో పాపులున్న 4,694 మంది రజకులకు రూ.4.694 కోట్లు, పాపులున్న 1,665 మంది నాయీబ్రాహ్మణులకు రూ.1.665 కోట్లు మరియు షాపులున్న 2,608 టైలర్లకు రూ.2.608 కోట్లు వెరసి మొత్తము 8,967 మంది లబ్ధిదారులకు రూ.8.967 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరములో రెండవ విడతగా షాపులున్న 4,564 మంది రజకులకు రూ.4.564 కోట్లు, షాపులున్న 1,570 మంది నాయీబ్రాహ్మణులకు రూ.1.570 కోట్లు మరియు షాపులున్న 2,915 టైలర్లకు రూ.2.915 కోట్లు వెరసి మొత్తము 9,049 మంది లబ్ధిదారులకు రూ.9,049 కోట్లు మంజూరు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో అర్హులు ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు 10.78 కోట్ల రూపాయల మెగా చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ  రమణారెడ్డి,బిసి కార్పొరేషన్ అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.Comments