2023 ఏడాదిని అంతర్ రాష్ట్రీయ చిరు ధాన్యాల సంవత్సరంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ది



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


2023 ఏడాదిని అంతర్ రాష్ట్రీయ చిరు ధాన్యాల సంవత్సరంగా భారత ప్రభుత్వం ప్రకటించిన


నేపథ్యంలో  నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించు కోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత 

పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రబీ లో ఈ పంట నమోదు, పౌర సరఫరాల, పశు సంవర్ధక, ఉద్యానవన, ఎలుకల నివారణ కార్యక్రమం, మిలెట్స్ సాగు పెంపు అంశాలపై చర్చించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, వ్యవసాయ సలహా మండలి సమావేశం లో చర్చించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, సాగునీటి విడుదల చెయ్యడం తో పాటు, పండించిన ధాన్యం కొనుగోలు కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తోరెడు, పెండ్యాల కు సంబంధించి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు చేరాలి, ఎక్కడైనా చేరక పోతే వాటిని తెలుసుకుని పరిష్కారం చెయ్యడం జరుగుతుంది. ఈ సారి ధాన్యం కొనుగోలు చేసిన వాటికి దాదాపు అందరికీ చెల్లింపులు జరపగలిగాము. జిల్లాలో పశువుల బీమా కి సంబంధించి నూతన మార్గదర్శకాలు మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తదుపరి వాటికి వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందస్తుగా సాగు నీటి విడుదల చేస్తున్న దృష్ట్యా ఆయా మండలాలకు ముందస్తుగా ఎరువులు విత్తనాలు మౌలిక వనరులను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. 


జిల్లా డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రైతు ల సమస్య లపై సమగ్రంగా చర్చించి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ఈ సమావేశం సద్వినియోగం చేసుకోవడం అభినందించ దగ్గ పరిణామం అన్నారు. జిల్లాలో సుమారు 2120 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని అన్నారు. ఇటీవల ఇక్విడార్ ప్రాంతంలో ఆక్వా సాగు చెయ్యడం ప్రారంభించిన దృష్ట్యా , వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఆదుకోవడం జరిగిందన్నారు. ఫిష్ ఆంధ్ర పథకంలో భాగంగా డోమెస్టిక్ మార్కెట్ విధానం ప్రోత్సహించడం యూనిట్స్ స్థాపనకు సబ్సిడీ తో కూడిన పథకాలు ఉన్నట్లు తెలిపారు. మత్స్య శాఖ అధికారులను సంప్రదించి తగిన శిక్షణ పొందవచ్చునని అన్నారు. మార్గదర్శకాలు మేరకు ఆసక్తి గల అర్హులు సంప్రదించి ప్రయోజనం పొందాలని సూచించారు.




 జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, ఈ ఏడాదిని చిరు ధాన్యాలు పండించాలని ఐక్య రాజ్య సమితి ప్రకటించడం జరిగిందన్నారు. చిరు ధాన్యాల సాగుపై ప్రత్యేక కథనాలను ప్రచురించడం ద్వారా సాగు విస్తీర్ణం పెంచడం జరగాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పశువులకు సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సబ్సిడీ అనంతరం కేజీ రూ.6.50 పైసలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 



జిల్లా డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు,  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా,  జి. జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పీ. శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు  ఇరిగేషన్ ఎస్ ఈ .. జి. శ్రీనివాసరావు, డి ఎం (సి ఎస్) ఆర్. తనూజ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) ఎస్. రామ్ మోహన్, గ్రౌండ్ వాటర్ డి డి వై. శ్రీనివాస్, జెడి (మత్స్య) బ్రహ్మనందం  ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు 


Comments