30 చెరువులు, గుంటల అభివృద్ధితో 25 గ్రామాలకు సాగు నీరు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్




అమరావతి (ప్రజా అమరావతి);


*30 చెరువులు, గుంటల అభివృద్ధితో 25 గ్రామాలకు సాగు నీరు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఘనత*


*సాగు, తాగు నీటికి లోటు లేని విధంగా శాశ్వతంగా సమృద్ధిగా భూగర్భ జలాలు*


*చురుగ్గా జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులు..బేతంచెర్ల వరకూ పైప్ లైన్ పూర్తి*


*డోన్ నియోజకవర్గంలోని దేవరబండ, చనుగొండ్ల, యాపదిన్నె,మల్లెంపల్లె,వెంకటాపురం, జగదుర్తి, ఉడుములపాడులో మంత్రి పర్యటన*


 వర్షాలతో ఆధారపడకుండా గోరుకల్లు నుంచి శాశ్వత తాగునీరు


నీటిపారుదల కింద ఎకరంలేని  డోన్ నియోజకవర్గం.. మన ప్రభుత్వ పాలనలో వచ్చే సీజన్ కల్లా నికరంగా 10వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక


డోన్ లో ఏర్పాటు చేయనున్న పాఠశాల, కళాశాలలో ఆడపిల్లలకు ప్రత్యేకంగావసతులకు పెద్దపీట


వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లో ఆలూరు, పత్తికొండ, డోన్, కర్నూలు ప్రాంతాల్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన 68 చెరువుల అభివృద్ధికోసం కసరత్తు


గంటన్నర సమయం పట్టే పరిస్థితి నుంచి అరగంటలో గమ్యం చేరేలా రహదారులు


కోవిడ్ విపత్తులోనూ రెండున్నరేళ్ల కష్టమే ఈ అభివృద్ధి


తుది దశకు చేరిన రూ.360 కోట్లతో హంద్రీ-నీవా ప్రధాన కాల్వ నుంచి జిల్లాలో 68 చెరువులకు నీరు మళ్లించే పనులు 


ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన హంద్రీనీవా నీటిని చెరువులకు మళ్లింపు పథకం


కృష్ఱగిరి మండల పరిధిలోని పులిచెర్ల కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి మూడు గ్రావిటీల ద్వారా చెరువులకు నీరు మళ్లించే  మెయిన్ పైప్ లైన్ పనులు త్వరలోనే పూర్తి


ఇప్పటికే నీటి మళ్లింపునకు చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతం


ప్రాథమిక దశలో డోన్ నియోజకవర్గంలోని 8 చెరువులను నీటి మళ్ళించి రైతుల సాగునీటి కష్టాలు పరిష్కరించే దిశగా అడుగులు


చనుగొండ్ల, వెంకటాపురం, యాపదిన్నె, అబ్బిరెడ్డిపల్లె, మల్లెంపల్లె,జగదుర్తి, ఉడుములపాడు, దేవరబండ చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమాన్ని త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం


వెంకటాపురం, మల్లెంపల్లె, జగదుర్తి, ఉడుములపాడు చెరువులను సందర్శించి ట్రయల్ రన్ ను పర్యవేక్షించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


Comments