*నోట్ : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఐటెంలో తప్పులు సవరించిన తర్వాత ఫైనల్ ఐటెం ఇది. ఈ ఐటెమ్‌నే వాడుకోగలరు.
అమరావతి (ప్రజా అమరావతి);
*విశాఖపట్నంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లు పై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*మార్చి 3–4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష.*
– పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు.
– 2014–2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో గ్రౌండ్ అయిన పెట్టుబడులు ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు వచ్చాయన్న అధికారులు.
– 2019–2022 మధ్య గ్రౌండ్ అయిన పెట్టుబడుల్లో సగటున ఏడాదికి రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడి.
– 2019 నుంచి ఇప్పటివరకూ ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు రూ.1,81,821 కోట్లు కాగా, ఈ పెట్టుబడులన్నీ వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయని, వీటి ద్వారా 1,40,903 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతోందన్న అధికారులు.
– వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలన్న సీఎం.
– రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్న సీఎం.
– కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలన్న సీఎం.
– దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇవ్వాలన్న సీఎం.
– గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామన్న అధికారులు.
– విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాలన్న సీఎం. వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్న సీఎం.
– అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలన్న సీఎం.
– వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.
*విశాఖపట్నంలో జి–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం సమీక్ష.*
– ప్రపంచదేశాల నుంచి హాజరు కానున్న 250 మంది ప్రతినిధులు.
– ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరు.
– అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరు.
– కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరు.
– మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశం.
– సమావేశంకోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం.
– అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్న సీఎం.
– ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్న సీఎం.
– ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్నిరోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలన్న సీఎం.
– ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్న సీఎం.
– ఏర్పాట్లుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలన్న సీఎం.
– ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపిన అధికారులు.
– ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
– ఆయా పర్యటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలన్న సీఎం.
addComments
Post a Comment