ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి--- జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్

 ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి---

 జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్

పుట్టపర్తి ,జనవరి 25 (ప్రజా అమరావతి) :  మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకొని ఓటు హక్కును ఒక వజ్రాయుధంలా వినియోగించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం పుట్టపర్తి మంగళకర కళాశాలలో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం కార్యక్రమాలు జరిగాయి. తొలుత జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఓటు యొక్క ప్రాధాన్యతపై విద్యార్థులు తమ మనోభావాలను తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ  1950 సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని ఆ మరుసటి రోజే భారత  గణతంత్ర రాజ్యాంగా అవతరించిందని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం  2011 సంవత్సరం జనవరి 25 నుంచి   ఓటర్ల దినోత్సవం సంవత్సరం జరుపుకుంటున్నట్లు తెలిపారు. 

అలాగే ఓటు హక్కు పై ప్రజాస్వామ్య వ్యవస్థ పై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కొరకు అనేక చైతన్య కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు కూడా ఖచ్చితంగా ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. అర్హత ఉన్న వారందరూ తప్పకుండా ఎన్నికలు పాల్గొని ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అనేక సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో కేవలం 40 నుంచి 50 శాతం ప్రజలు ఎన్నికల్లో ఓటును సద్వినియం చేసుకున్నారని అలా కాకుండా బలమైన ప్రజాస్వామ్య పరిపాలన ప్రభుత్వం ఏర్పాటు  కొరకు  సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకొనుటకు నూటికి నూరు శాతం  ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలన్నారు. అప్పుడే సమాజాభివృద్ధిలో భాగంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువగా నిలుస్తాయని, అంతేగాక ప్రగతి పథంలో దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. అందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో ముఖ్యమైనది అన్నారు. ఓటు  తరతరాల గతిని మార్చే అస్త్రం ప్రజాస్వామ్యానికి పునాది గా జిల్లా కలెక్టర్ అభివర్ణించారు. భారత్ ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు జిల్లాలో అన్ని స్థాయిలలో పండుగ వాతావరణం లో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం  ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టిన తదుపరి  పలు యువ ఓటర్లకు ఓటరు ఎపిక్ కార్డులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ ఎన్నికల విభాగం తాసిల్దారులు శ్రీనివాసులు,  మైనుద్దీన్, మంగళకర కళాశాల కరస్పాండెంట్ సురేష్ , తాసిల్దార్ నవీన్, ఎన్నికల ఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ నరసింహులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments