జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం పరిశ్రమల స్థాపన కీలకం రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం పరిశ్రమల స్థాపన కీలకంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పై అవగాహన పెంచాలి


ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి..


- కలెక్టర్ మాధవీలత 


 జిల్లాలో మహిళా, ఔత్సహిక పారిశ్రామికవేత్తలను అభ్యున్నతికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత పేర్కొన్నారు.


 శనివారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు,  అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్  మాధవీలత సమీక్ష సమావేశం నిర్వహించారు.


 ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె.  మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో  2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో 200 మంది మహిళా  పారిశ్రామికవేత్తలను ఎంపిక చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి అడుగులు పడ్డాయన్నారు.  మార్చి, 2023 చివరి నాటికి మరో 1500 మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ దిశలో 

 ఇప్పటివరకు  PIMC షెడ్యూల్ ప్రకారం, 206 మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రతి మండలం నుండి కనీసం 10 మంది లబ్ధిదారులను  ఎంపిక చేసినట్లు తెలిపారు..


  మహిళా పారిశ్రామికవేత్తల నుండి ఇప్పటికే వివిధ బ్యాంకుల వారీగా 206 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 54, బ్యాంక్ ఆఫ్ బరోడా 23, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 85, బ్యాంక్ ఆఫ్ ఇండియా 14, కెనరా బ్యాంక్ 1, ఇండియన్ బ్యాంక్ 8, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 15, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 6 దరఖాస్తులతో మొత్తం 206 దరఖాస్తు చేసిన మహిళా పారిశ్రామిక  వేత్తలకు పీఎంఈజీపి క్రింద పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.


 జిల్లాలో ఇప్పటివరకు  ఎంఎస్ఎంఇ ప్రోగ్రాం క్రింద  2274 యూనిట్లకు గాను రూ. 369.94 కోట్లు పెట్టుబడి  నిధి అందించగా 9677 మందికి ఉపాధికి అవకాశాలు లభించాయన్నారు.


 జిల్లాలో మరో 3 భారీ పరిశ్రమలు ఏర్పాటుకు గాను రూ. 1660 కోట్లతో నిర్మించునున్న పరిశ్రమలో వివిధ దశల్లో ఉన్నాయని ఈ పరిశ్రమల వలన 2691 మంది కి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమలు  కొవ్వూరు మండలం పంగిడిలో  సోలార్ గ్లాస్, నల్లజర్ల మండలం పోతవరంలో బయోటెక్నాలజీ, గోకవరం మండలం గుమ్మలదొడ్డి లో ఇన్ ఆర్గానిక్ కెమికల్స్ కంపెనీల పనులు  వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.


 జిల్లాలో క్లస్టర్ అభివృద్ధి ప్రోగ్రాం కింద  రూ. 15 కోట్ల ప్రతిపాదనతో 14  ఫర్నిచర్ క్లస్టర్ యూనిట్లు ఏప్రిల్ 2023 నాటికి ప్రారంభించినట్లు తెలిపారు.


 2022 - 23  సంవత్సరానికి గాను జిల్లాలో సిలికాన్ కార్బన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ రాజమహేంద్రవరం వారిచే  27 యూనిట్లకు గాను రూ. 28కోట్లు, గోదావరి సర్మిక్ అండ్ రీ ఫ్యాక్టరీ అసోసియేషన్ ధవలేశ్వరం వారు 25 యూనిట్లకు గాను రూ 10 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని  పేర్కొన్నారు.


 ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గా  జిల్లాలో ఇప్పటివరకు డిఐసి, ఏపీకే విఐబి, కెవిఐసి క్రింద 486 దరఖాస్తులు రాగా 249 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 53 యూనిట్లు గ్రౌండ్లింగ్ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని పరిశ్రమల స్థాపన దిశగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహం అందించాలని స్పష్టం చేశారు.


 సమావేశంలో పరిశ్రమల శాఖ బి. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ పి ప్రదీప్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, డిపిఓ పి. జగదాంబ, మైక్రో ఇరిగేషన్ అధికారి శ్రీనివాసరావు, డిసిఐఎఫ్, ఏపీఐఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments