ఫిజిక్స్ టీచర్ గా జిల్లా కలెక్టర్ మాధవీలత

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


ఫిజిక్స్ టీచర్ గా జిల్లా కలెక్టర్ మాధవీలత విద్యార్థుల్లో 10 వ తరగతి బోధన పటిమ పరిశీలన 


నిరంతర అభ్యాసం ద్వారా భాష పై పట్టు వస్తుంది


కలెక్టర్ మాధవీలత 


రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, పౌష్టికాహరాన్ని అందిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.


శుక్రవారం మధ్యాహ్నం లాలా చెరువు మునిసిపల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజన పథకం పై వివరాలు తెలుసుకుని, పదార్థాలను పరిశీలన చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆసక్తి కలిగించి ఉన్నత విద్యావంతులు చేయడం కోసం ప్రభుత్వ స్కూల్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందన్నారు.  ఈ సందర్భంగా 10 వ తరగతి లోకి వెళ్ళి వారితో బోధన విధానం పై వివరాలు తెలుసుకున్నారు. గణితం, సైన్స్, ఇంగ్లీష్ కు సంబంధించి ఉపాధ్యాయులు వస్తున్నారా అని అడుగగా, వస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.  మధ్యాహ్న భోజన పదార్ధాలు ఎంతమంది తీసుకుంటున్నారు అని అడుగగా, చేతులు ఎత్తెందుకు, విద్యార్థులు సంశయహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, మీ నుంచి సూచనలు వస్తే ఆమేరకు చర్యలు తీసుకుంటామని, మరింత నాణ్యమైన విధానం లో ఏర్పట్లు చేస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకు అందచేస్తున్న ఆహార పదార్థాలను కలెక్టర్ రుచి చూడడం జరిగింది. కూరలు, కోడి గుడ్ల తీసుకోవడం జరుగుతోందని, కొందరు విద్యార్థులు ఇంటి నుంచి అన్నం తీసుకుని వస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. అన్నం గింజ పెద్దగా ఉండడం వల్లనా అంటూ కలెక్టర్ ప్రశ్నించారు.  మీకు అందచేసే ఆహారం మంచి పోషక విలువలు కలిగినవని కలెక్టర్ తెలిపారు. స్కూల్  అవరణ, తరగతి నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ తరగతి గదిలో నాలుగు ట్యూబ్ లైట్ లకు గాను మూడు మాత్రమే వెలగడం ఏమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మిగిలిన ఒక్కటి కూడా తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు నిర్వహణ,  పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. 


ఫిజిక్స్ టీచర్ గా జిల్లా కలెక్టర్ మాధవీలత స్థానిక స్కూల్ లోని 10 వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాధవీలత ముఖాముఖి సంభాషించారు. ఫిజిక్స్ పాఠ్యాంశం లో 5 వ చాప్టర్ లోని  సాదా ఉపరితలాలు -  కాంతి వక్రీభవనం పై కలెక్టర్ మాధవీలత ప్రశ్నలను సంధించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు కలెక్టర్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఇద్దరు విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ప్రతి ఒక్క విద్యార్థి లో ప్రతిభకు కొదవ లేదని, వారిలోని నైపుణ్యాన్ని గుర్తించి, వారు వెనుకబడిన సబ్జెక్ట్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆంగ్ల మాధ్యమం ద్వారా మరింత అభివృద్ధి చెంద గలరని, పుట్టినప్పుడు మనకు ఏ భాష తెలియదు, కానీ తెలుగు భాష ఎలాగైతే నేర్చుకున్నారో, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా నిరంతరం అభ్యాసం చేయాలి... ఇంగ్లీష్ లో మాట్లాడ టానికి మీ తెలుగు పదాలను ఆంగ్ల లోకి తర్జుమా చేసుకుని సంభాషించడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని కలెక్టర్ ప్రోత్సహించారు. 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ లో ఫస్ట్ రావడం పట్ల వారిని అభినందిస్తూ, మిగతా పిల్లలు కూడా వీరికి ఏ మాత్రం తీసిపోరని పేర్కొన్నారు. కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవాడానికి అభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యం అని అన్నారు.


కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి ఎస్. అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Comments