విద్యా అమృత మహోత్సవం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోస్థానం

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ  - సమగ్ర శిక్షా*

*విద్యా అమృత మహోత్సవం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోస్థానం*

*- * ఉపాధ్యాయులను అభినందించిన కమీషనర్, ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్ గారు


*-* అనతికాలంలో అధిక వీడియోలు, ప్రాజెక్టులు అప్‌లోడ్ చేసిన ఉపాధ్యాయులు


అమరావతి (ప్రజా అమరావతి);


కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 'శిక్షక్ పర్వ్' వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘విద్యా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  రెండో స్థానం దక్కిందని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

వినూత్న, వైవిధ్య  విద్యా అంశాలతో పిల్లల మనసుని ఆకట్టుకునేలా చిన్నచిన్న అద్భుతమైన ఆలోచనలని దృశ్య రూపంగా మార్చి బోధనా అభ్యసనకు తగిన 1,00,758 ప్రాజెక్టులను అనతి కాలంలోనే అప్ లోడ్ చేసి ఘనత సాధించారని పేర్కొన్నారు.  

 ప్రథమ స్థానం సాధించిన బిహార్, ఇతర రాష్ట్రాల్లో మూడు నెలలు ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా,  మన రాష్ట్రం ఒకనెలలోనే అధికంగా ప్రాజెక్టులు అప్ లోడ్ చేసి ద్వితీయ స్థానం కైవశం చేసుకుందని కమీషనర్ గారు తెలిపారు. 

ఈ సందర్భంగా అప్ లోడ్ చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, సముదాయ పర్యవేక్షణ (స్కూల్ కాంప్లెక్స్) సభ్యులను, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, సీమ్యాట్, ఎస్సీఈఆర్టీ సిబ్బందిని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ సురేష్ కుమార్ గారు, సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు అభినందనలు తెలిపారు.

ఉపాధ్యాయులు ఆధునిక సాంకేతికతను జోడించి మరింత బోధన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు గొప్ప వేదికగా సద్వినియోగ పడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు, కృషి, బోధన పద్ధతులు ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు సద్వినియోగపరుచుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని అని అన్నారు. 

జాతీయస్థాయిలో 10 వీడియోలను ఎంపిక చేసి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు.



Comments