పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక మోడల్‌గా నిలిచారు.


 

విజయవాడ (ప్రజా అమరావతి);

ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 

- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక మోడల్‌గా నిలిచార


ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి సి.యస్.ఆర్. ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ - క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేమన్నారు. లక్ష్యాన్ని చేరువ కావడానికి అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని.. అందరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎపుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో ఉద్యోగుల యూనియన్‌లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారన్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలున్నాయని.. కానీ ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తున్నాయని.. ఒక్క రూపాయి కూడా తమ ప్రభుత్వం దుబారా చేయటం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.  ప్రతిపక్షం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  అబద్దాలను‌ ప్రచారం చేస్తోందన్నారు.  గతంలో ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రతిపక్షనేత అనలేదా? అని ప్రశ్నించారు. ఇపుడు అదే వ్యక్తి తన చంద్రన్న కానుక, విదేశీ విద్యను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికార పార్టీ డీఎన్ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని తెలిపారు. విద్య, వైద్యం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలకు మొదటి అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలనేది గత పాలకుల ఆలోచన అని తెలిపారు. బహుజనుల‌ పేరు చెప్పుకుని వచ్చిన‌ పార్టీలు సైతం అదే దారిలో వెళ్లాయన్నారు. నేటికీ పార్లమెంట్‌లో మహిళా బిల్లుని రానివ్వరని సజ్జల విమర్శలు చేశారు. కానీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు‌ 50 శాతం రిజ్వేషన్లు అమలు చేశారని స్పష్టం చేశారు. అందులోనూ 50 శాతం‌ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. సీఎం వైఎస్ జగన్ తన‌ నిర్ణయంతో బెంచ్ మార్కుగా మార్చారని…  సజ్జల అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని భావిస్తే సంతకం చేయడానికి సీఎం జగన్ వెనుకాడరని.. ఆయనకు తెలుగుపై మమకారం ఉందన్నారు. పులివెందుల‌బిడ్డ అచ్చ తెలుగులో మాట్లాడగలరని.. ఇంగ్లీష్‌పై మోజుతో‌ తెలుగుపై కోపంతో ఇంగ్లీష్ మీడియం‌ పెట్టలేదని అవసరం అయి పెట్టారని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్ధాయిలో పేద విద్యార్ధులు రాణించాలని ఇంగ్లీష్‌ను ప్రోత్సహించారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో అరకొరగానే నిధులు ఇచ్చిందని, అదీ బకాయిలు పెట్టిందన్నారు. దేశ, విదేశాల్లోని టాప్ 100 యూనివర్సిటీలలో పేద విద్యార్ధులు సీటు తెచ్చుకుంటే ఎన్ని ‌కోట్లైనా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. 101 నుండి 200 ర్యాంక్ వరకూ 50 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తుందన్నారు. బలహీనవర్గాల కుటుంబాలలో‌ మార్పు తీసుకురావడానికే విద్యకు ఇంత పెద్దపీట వేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మేలుని‌ అన్ని వర్గాలకి తెలియజెప్పాలన్నారు. అధికారం అనేది సేవ అని.. ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చే బాధ్యత అని ముఖ్యమంత్రి విశ్వసిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం దావోస్ 9 సార్లు వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఒప్పందాన్ని కూడా  అమలు చేయలేదన్నారు.

       ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.  గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ద వహించామని,  ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన అభివృద్ధి సంక్షేమ పధకాల లక్ష్యాలను ప్రజలకు చేరేలా ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని రాజన్నదొర అన్నారు.  

       రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సామజిక న్యాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీ వర్గాలకు చెందిన 50 శాతం ప్రజాప్రతినిధులను ప్రభుత్వ పాలనలో భాగస్వాములను చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  అంబేద్కర్ భావజాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఎస్ సి, ఎస్ టి లతో పాటు పేద ప్రజలందరికీ సంక్షేమ పధకాల ద్వారా ఆధుకుంటున్నదన్నారు.  ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవలు అందించడంలో, ప్రజా సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వచ్చేలా ప్రతీ అధికారీ చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.   

శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు, బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న సంక్షేమాన్ని-అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అధికారులపై కూడా ఉందన్నారు. ఎస్టీ, ఎస్సీలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అధికారులు కూడా తోడుగా ఉండాలన్నారు.    తొలుత ఎం ఎల్ సి డా. మొండితోక అరుణ్ కుమార్ జ్యోతీ ప్రజ్వలన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. 

        అనంతరం ఏ పి ఎస్ సి, ఎస్ టి గజిటెడ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ-2023 ను, కాలెండర్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేసారు.  అనంతరం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ సలహాదారునకు, ఇతర అతిధులకు  మెమెంటోలు  అందించి దుశ్శాలువతో సత్కరించారు.    

        ఈ కార్యక్రమంలో  బాపట్ల ఎంపీ నందిగం  సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు సోషల్ జస్టిస్ జూపూడి ప్రభాకర్ రావు, ఎస్ టి కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు,  ఇ ఎన్ సి ఎస్. బాలూనాయక్, చీఫ్ ఇంజినీర్ జెన్కో ఎం. పద్మసుజాత, ఎస్ సి, ఎస్ టి గజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.వి. రమణ, జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్, పలువురు గెజిటెడ్ అధికారులు, వివిధ జిల్లాల నుండి హాజరైన గజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘ సభ్యులు  పాల్గొన్నారు.


Comments