జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం

 జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం


పుట్టపర్తి ,జనవరి 25 (ప్రజా అమరావతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి .బసంత్ కుమార్ జాయింట్ కలెక్టర్ చేతన్, డిఆర్ఓ కొండయ్య ,ఆర్డీవో భాగ్యరేఖ,  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాతీయగీతం ఆలపించారు. ఆ తర్వాత  కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత   భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పాక్ష పాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడి లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లు  ఓటర్ల

ప్రతిజ్ఞ ను చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల అక్షరాస్యత అనే నినాదంతో జాతీయ ఓట్ల దినోత్సవాన్ని భారత్ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటు హక్కు కల్పించబడిందని, అంతేగాక కుల మత లింగా ప్రాంతా దనిక పేద వివక్షత లేకుండా అక్షరాసులకు నిరక్షరాశులకు సార్వత్రిక ఓటు హక్కు కల్పించి ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిలలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వెంకటనారాయణ ,ఎన్నికల తాసిల్దార్ లు మైనుద్దీన్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


Comments