సెంట్రల్ జైల్ లో ఖైదీలకు , జైల్ కి చెందిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కు ఈరోజు వివిధ వైద్య పరీక్షలురాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


సెంట్రల్ జైల్ లో ఖైదీలకు ,  జైల్ కి చెందిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కు ఈరోజు వివిధ వైద్య పరీక్షలు


నిర్వహించడం జరిగిందని డి ఐ జి ( జైళ్ల శాఖ)  ఎం ఆర్ రవి కిరణ్ పేర్కొన్నారు.


శనివారం స్థానిక సెంట్రల్ జై ల్ ఆవరణలోని సమావేశ మందిరంలో జీ ఎస్ ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో  మెడికల్ స్క్రీనింగ్ క్యాంపు  నిర్వహించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డి ఐ జీ .- ఎమ్.ఆర్. రవి కిరణ్ మాట్లాడుతూ, ఈరోజు నిర్వహించిన మెడికల్ స్క్రీనింగ్ పరీక్షలకు ఖైదీలతో పాటుగా, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులు హజరవ్వడం జరిగిందన్నారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించడమే కాకుండా, ఉచితంగా మందులు అందచేశామన్నారు. 


సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ ఎస్. రాజారావు మాట్లాడుతూ, ఈరోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో జి ఎస్ ఎల్ ఆసుపత్రి  వారి సౌజన్యంతో  సెంట్రల్ జైల్ పోలీస్ సిబ్బందికి అలాగే వారి కుటుంబసభ్యులకు అన్ని రకాల వ్యాధి నిర్ధారిత పరీక్షలు ఉచితంగా చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 167 మంది జైలు సిబ్బంది 76 మంది కుటుంబ సభ్యులు పాల్గొని అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి సెంట్రల్ జైల్ సూపరింటేండేంట్ రాజారావు  పాల్గొన్నారు.


మహిళలో రొమ్ము క్యాన్సర్ వ్యాది నీ కనుగొనుటకు చేసే మమోగ్రఫి పరీక్షలు,గర్భాశయ క్యాన్సర్ కనుగొనటానికి చేసే పాప్ స్మ్యేర్ పరీక్షలు,గుండె సంబంధించిన పరీక్షలు ECG మరియు 2D ECHO పరీక్షలు , కంటి పరీక్షలు,బిపి  పరీక్షలు ,డెంటల్ సమస్యలు మొదలైనవి చెయ్యటం జరిగిందన్నారు. 


ఈ కార్యక్రమంలో GSL ఆసుపత్రి నుంచి సీనియర్ క్యాన్సర్  డాక్టర్ ఆనందరావు, డాక్టర్ తరుణ్ , పల్మొనలజీ డాక్టర్ సోమనాథ్ , గుండె డాక్టర్ సత్యేంద్ర , మార్కెటింగ్ జి. యం హిమ శంకర్ , చీఫ్ కోఆర్డినేటర్ పార్థసారథి  మార్కెటింగ్ టీం సభ్యులు, నర్సింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు...ఈ  కార్యక్రమంలో సెంట్రల్ జైల్ సూపరింటేండేంట్ ఎస్.రాజారావు,  సెంట్రల్ జైల్  డిఎస్పీ ఎమ్. రాజ్ కుమార్, మహిళా జైల్ డిఎస్పీ కె. వసంత కుమారి, జీ ఎస్ ఎల్ ఆసుపత్రి వైద్యులు డా అరుణ్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది,  డిప్యూటీ సివిల్ సర్జెన్ డా పి. కోమలి, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments