పేద ప్రజలు ఖరీదైన వైద్య సేవలు పొందే విషయంలో అప్పులపాలు కాకూడదు

 

నెల్లూరు  జనవరి 28 (ప్రజా అమరావతి);


పేద ప్రజలు ఖరీదైన వైద్య సేవలు పొందే  విషయంలో అప్పులపాలు కాకూడద


నే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. యాదాల అశోక్ బాబు పేర్కొన్నారు.


ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారిగా భాద్యతలు చేపట్టాక తొలిసారిగా నెల్లూరు విచ్చేసిన ఆయన  ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న వైనంపై ప్రభుత్వ, ప్రయివేట్ వైద్యశాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.


ఈ సందర్బంగా నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో గతంలో కేవలం 1057 వ్యాధులకు మాత్రమే అరకొరగా సేవనందించేవారని, ప్రస్తుతం 3225 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి పేదవానికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. అదేవిధంగా నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలే మార్చి వేశారన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు అన్ని రకాల మౌలిక వసతులు, ఖరీదైన వైద్య పరికరాలు  అందజేశారన్నారు. ఈ మూడేళ్లలోనే 40 వేల మందికి పైగా డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించారన్నారు. వైద్య సేవలు అందించే విషయంలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా ఖరీదైన వైద్యం అందరికీ అందుబాటులో   ఉంచుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఇప్పటివరకు 7 వేల కోట్లు ఖర్చు చేసి 34 లక్షల మందికి వైద్యసేవలు అందించామన్నారు. వైద్య శాఖకు సంబంధించి రాష్ట్రానికి 11 జాతీయ అవార్డులు రావడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. అదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ అమలులో వివిధ లోపాలను గుర్తించామని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించి మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. 


ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త  డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా మేనేజర్ వెంకట మురళి ప్రొఫెసర్ దారా విక్రమ్ తదితరులు పాల్గొన్నారుComments