నేడు రాష్ట్ర శాసన మండలి,అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

 నేడు రాష్ట్ర శాసన మండలి,అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి,25 జనవరి (ప్రజా అమరావతి):భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 26వ తేది గురువారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనంపై శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అసెంబ్లీ భవనంపై:

గురువారం ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనంపై రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.

సచివాలయం మొదటి బ్లాకు వద్ద:

సచివాలయం మొదటి బ్లాకు వద్ద గురువారం ఉ.7.30 గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద:

నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద ఉ.10 గం.లకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.

      

Comments