ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలి జిల్లా కలెక్టర్


 ప్రజలకు  మెరుగైన పౌర సేవలు  అందించాలి

జిల్లా కలెక్టర్


నల్లచెరువు, జనవరి 24 (ప్రజా అమరావతి):  సచివాలయ అధికారులు, సిబ్బంది  ప్రజలకు సేవలందించడంలో మనసుపెట్టి పనిచేయండి , ప్రజలకందించాల్సిన సేవల విషయంలో నిర్ణీత కాలపరిమితి కోసం వేచి చూడకుండా వెంటనే పరిష్కరించండని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ ఆదేశించారు.    మంగళవారం 

నల్లచెరువుమండలం లోని యం.అగ్రహారం, ఓరువాయి,తలమర్ల వాండ్ల పల్లి గ్రామాలలో  గ్రామ సచివాలయలు మరియు ఈ క్రాప్ బుకింగ్ పంటలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  సుబ్బారావు  తదితరులు పాల్గొన్నారు ఆయా  గ్రామ  సచివాలయాన్ని ఆకశ్మిక తనిఖీ నిర్వహించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేసారు. ముందుగా  గ్రామ సచివాలయాలలో ఏర్పాటు చేసిన సేవలకు సంబంధించి బోర్డులను కలెక్టర్ పరిశీలించారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ కచ్చితంగా పాటించాలని తెలిపారు. తప్పనిసరి సాయంత్రం వరకు సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో వుండాలి, స్పందన వినతులు స్వీకరించాలి , విజిటర్స్ రిజిస్టర్లలో సంతకం చేసిన జిల్లా కలెక్టర్ . ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూఅన్ని సచివాలయాల్లో వివిధ సంక్షేమ పథకాలు  లబ్ధి పొందిన అర్హులైన జాబితాను/ అనర్హులైన  లబ్ధి పొందన జాబితాను ఖచ్చితంగా ప్రదర్శించాలని తెలిపారు.స్వచ్ఛంద సేవకులుగా అవినీతి లేని వ్యవస్థ తీసుకువచ్చేలా వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిందన్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడం జరుగుతోందన్నారు.ప్రతి వాలంటీర్ కి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత ఉందని, ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.  ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో సేవలు 150 రకాల సేవలు అందించాలని తెలిపారు.


రైతులకు మెరుగైన సేవలు అందించండి

 ఎం అగ్రహారం గ్రామ సచివాలయం తనిఖీ అనంతరం.జిల్లా కలెక్టర్ ద్విచక్ర వాహనం బయలుదేరి మద్దిమడుగు వెంకటరమణ అనే రైతు టమాట పంటను పరిశీలించారు,  ఈ పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  తలమర్ల వాండ్ల గ్రామమునందు హరినాథ్ నాయుడు పంట పొలాన్ని పరిశీలించారు.  ఓరువాయ గ్రామమునందు వెంకట్ రెడ్డి టమాట పంటను పరిశీలించారు. పంటల  బీమా పరిహారం లో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా  వాటిని సరిచేయాలని సిబ్బందికి సూచించారు. ఖరీఫ్ కాలంలో  రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఉచిత సేవలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని సిబ్బందిని ఆదేశించారు.

  

ఈ కార్యక్రమంలోఎంపీడీవో  శకుంతల, వ్యవసాయ అధికారి  భారతి, అగ్రికల్చర్ ఏడి  సత్యనారాయణ సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు



Comments