పెనుగొండలో ఏక సభ్య కమిషన్ సమావేశం

 

పెనుగొండలో ఏక  సభ్య కమిషన్ సమావేశంపెనుగొండ , జనవరి 28 (ప్రజా అమరావతి): 

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ని భువన విజయం  సమావేశ మందిరంలో  శనివారం సాయంత్రం బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై అధ్యయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ శ్యాముల్ ఆనంద్ కుమార్  ఐఏఎస్ (,రిటైర్డ్)  అనంత పురం ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ , సబ్ కలెక్టర్  కార్తీక్, బిసి సంక్షేమ శాఖ అధికారి నిర్మలాజ్యోతి, లైజనింగ్ అధికారులు మస్తాన్, రాజ కుళ్ళయప్ప, సత్య నారాయణ బోయ/వాల్మీకి సంఘాల ప్రతనిధులు తదితరులు పాల్గొన్నారు. 

 ఈ సందర్భంగా 

బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ సంబంధిత వర్గాల ప్రజలతో అధ్యయన సమావేశం నిర్వహించి వారి 

 అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరించారు.


బోయ/వాల్మీకి సంఘాల నేతలు, గిరిజన సంఘాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ముఖ్యంగా వాల్మీకి కులస్తులు దేశవ్యాప్తంగా ఎస్సీలుగాను, కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీలు గాను పరిగణించబడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఐదు జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతంలో నివసించు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని ,మా కులానికి ఎలాంటి కులవృత్తి లేక జీవిస్తున్నట్లు వివిధ సంఘాల ప్రతినిధులు కమిషన్ చైర్మన్ దృష్టికి విన్నవించారు.అలాగే బీసీ(ఏ) జాబితాలో ఉండటం వల్ల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడు తున్నామని  ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి కులంలోని ప్రజలు దాదాపు అందరూ దరిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని, బోయ /వాల్మీకి  వాస్తవ  స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందజేసి తమ వర్గాలకు న్యాయం చేయాలని పలువురు వినితులను అందజేశారు.

కమిషన్ ఏర్పాటుపై బోయ/వాల్మీకి సంఘాల నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్టీ సంఘాల ప్రతి నిధులు కూడా తమ వాదన వినిపించారు.


Comments