విద్యా విధానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు విద్య సక్రమంగా అందించాలి ఉండి: జనవరి 28 (ప్రజా అమరావతి);


     రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  అమలు చేస్తున్న  విద్యా విధానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు విద్య సక్రమంగా అందించాల


ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను ఆదేశించారు.


     శనివారం ఉండి మండలం  చెరుకువాడ జడ్పీ ఉన్నత పాఠశాల ,  ఉండి గ్రామం ఎన్ఆర్ అగ్రహారం లోని జడ్పీ ఉన్నత పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.  ప్రశాంతి ,  జాయింట్ కలెక్టర్ జె వి మురళి.


    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో  సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి విద్యా విధానం   ట్యాబ్ లు లేవని అటువంటిది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరికి ఉత్తమమైన విద్యను అందించే దిశగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ఎనిమిదవ తరగతి నుండే టాబుల ద్వారా ఎంతో ఖరీదైన బై జ్యూస్ కంటెంట్ను వినియోగించి విద్యార్థులకు ఉన్నత బోధన విధానాన్ని అమల్లోకి తెచ్చారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు ట్యాబులను తీసుకొచ్చి అందులోనే పాటలను నేర్చుకోవాలని ,ఉపాధ్యాయులు విధిగా టాబ్ ను వినియోగించి వారికి విద్యా బోధన చేయాలని ఆయన సూచించారు . ట్యాబ్  వినియోగం లో విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన అన్నారు.  పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న  మంచినీరు పరిశుభ్రంగా ఉండాలని ఆయన అన్నారు.  మంచినీరు అందించే ట్యా ప్ లను ఆయన పరిశీలించారు. ప్రతి పాఠశాలల్లో ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి జలాలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలల్లో  మరుగుదొడ్లు,  విద్యార్థిని విద్యార్థులు విధిగా వినియోగించుకునే విధంగా చూడాలని ,  బహిరంగ గా ఏ విద్యార్థిని విద్యార్థులు మలవిసర్జన చేయకుండా బయటికి వెళ్లకుండా   వారిని మొటివేట్ చేయాలన్నారు.  స్కూలు తెరిచిన దగ్గర నుండి విద్యార్థులు వినియోగించుకునే విధంగా బాత్రూములు ఓపెన్ చేసి ఉంచాలని ఆయన సూచించారు.  మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడంతోపాటు నీరు పారే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.  ఎక్కువ విద్యార్థిని విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక వాచ్ మెన్ ను ఇవ్వడం జరుగుతుందని వారిని వినియోగించుకొని పాఠశాల ఆస్తులను కాపాడుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో  ఎనిమిదవ తరగతి విద్యార్థుల తో మాట్లాడి వారి ట్యాబ్ లు ఏ విధంగా వినియోగంలో ఉందో ఆయన పరిశీలించారు.  అదేవిధంగా పాఠశాలల విలీనంపై ఎందుకు లేట్ అయింది తదితర కారణాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్య బోధన ఏ విధంగా చేస్తున్నారు,  అర్థమవుతుందా ఎవరెవరు టీచర్లు చెప్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.


 

ఈ  కార్యక్రమంలో  ఆర్ జె డి డి. మధుసూదన్ , డీఈవో ఆర్ వెంకట రమణ, సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయకర్త శ్యామ్ సుందర్, హెచ్ ఎం లు ,  ఉపాద్యాయులు , ఇంజినీరింగ్ అసిస్టెంట్   తదితరులు పాల్గొన్నారు.


Comments