టీడీపీ నేతల లైంగిక వేధింపులు - రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్

 టీడీపీ నేతల లైంగిక వేధింపులు

- రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్


- విశాఖ సీపీ, దిశ ఏసీపీతో మాట్లాడిన కర్రి జయశ్రీ రెడ్డి

- బాధిత మహిళా నేతకు కమిషన్ అండగా ఉంటుందని వెల్లడి


విజయవాడ (ప్రజా అమరావతి):

కర్నూలు జిల్లా డోన్ టీడీపీ నేత లైంగిక వేధింపులపై ఆపార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ మీడియా ముందుకొచ్చిన ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్ గా స్పందించింది. ఈమేరకు బుధవారం ఈ వ్యవహారానికి సంబంధించిన మీడియా కథనాలపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి ఆరాతీశారు. బాధితురాలి ఆవేదనను అర్ధం చేసుకుని ఆమెకు అండగా నిలవడానికి మహిళా కమిషన్ ముందుంటుందన్నారు. 

దీనిపై విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్, దిశ ఏసీపీలతో కర్రి జయశ్రీ రెడ్డి మాట్లాడారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన గోడి అరుణ ఫిర్యాదుపై  దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్‌ సహించే ప్రసక్తే లేదన్నారు.


Comments