ఇంద్రకీలాద్రి పై ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు


ఇంద్రకీలాద్రి పై ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు


శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి):       


     ఈరోజు భోగి సందర్బంగా ఉదయం ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి మంత్రోచ్చారణాల నడుమ సాంప్రదాయబద్ధముగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, మేళములతో వైభవముగా భోగి మంటలు కార్యక్రమం ప్రారంభం..


కార్యక్రమంలో పాల్గొని భోగి మంటలు వెలిగించి, ప్రదక్షిణలు చేసిన ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు  సిబ్బంది మరియు భక్తులు..


సంక్రాంత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపి, శ్రీ అమ్మవారి స్వామివారి కృపాకటాక్షములు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపిన ఆలయ కార్యనిర్వాహణాధికారి గారు..


సంక్రాంతి సందర్బంగా మహామండపం 07వ అంతస్తు పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు..


బొమ్మల కొలువు వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి బొమ్మ కొలువు ప్రారంభించిన కార్యనిర్వాహనాధికారి గారు..


సంక్రాంతి సందర్బంగా బొమ్మల కొలువు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించిన కార్యనిర్వాహణాధికారి వారు..


ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసములు, హరిదాసు కీర్తనలు, బొమ్మల కొలువు, ముగ్గులు..


కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి గారు, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు పి. సుధారాణి గారు, పి. చంద్రశేఖర్ గారు, ఎన్. రమేష్ గారు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది..


పెద్దరాజగోపురం ఎదురుగా ఉన్న ప్రదేశం నందు సాయంత్రం 05 గం. లకు చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయు కార్యక్రమం..

Comments