వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభం

 *వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభం**: ఇక ఇప్పటినుంచి పెంచి ఇస్తున్న పెన్షన్ రూ.2,750*


*: జిల్లాలో 2,67,149 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ. 74,09,27,000 పంపిణీ*


*: జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక కింద కొత్తగా 9,047 మందికి లబ్ధి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 03 (ప్రజా అమరావతి):


*తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి మంగళవారం పెన్షన్ పెంపు వారోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.*


*పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, డిఆర్డీఏ పిడి నరసయ్య, పింఛన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.*


*జిల్లాలో 2,67,149 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ. 74,09,27,000ల లబ్ధి : జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


*ఈ సందర్భంగా వైఎస్సార్ పెన్షన్ కానుక జిల్లాలో అర్హులైన 2,67,149 మంది పింఛన్ లబ్ధిదారులకు 74,09,27,000 రూపాయల లబ్ధి కలగడం జరిగిందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక కింద కొత్తగా 9,047 మందికి లబ్ధి కలగడం జరిగిందన్నారు.*


*జిల్లాలో ఇంతకుముందు 2,58,489 మంది లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుండగా, కొత్తగా 2023 జనవరి నుంచి 9,047 మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయని, మొత్తం కలిపి 2,67,149 మంది పెన్షన్ లబ్ధిదారులకు 74,09,27,000 రూపాయల లబ్ధి కలగడం జరిగిందన్నారు.


*జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొత్తగా 1,636 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 47,260 మందికి 13,16,41,250 రూపాయల లబ్ధి కలగడం జరుగుతుందన్నారు. హిందూపురం నియోజకవర్గం లో కొత్తగా 963 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 35,502 మందికి 9,86,32,000 రూపాయల లబ్ధి కలగడం జరుగుతుందన్నారు. కదిరి నియోజకవర్గంలో కొత్తగా 1,558 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 43,294 మందికి 12,00,05,500 రూపాయల లబ్ధి కలుగుతుందన్నారు. మడకశిర నియోజకవర్గంలో కొత్తగా 1,241 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 39,292 మందికి 10,83,92,500 రూపాయలు, పెనుకొండ నియోజకవర్గంలో కొత్తగా 1,373 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 41,406 మందికి 11,47,84,000 రూపాయలు లబ్ధి కలుగుతుందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్తగా 1,559 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 42,231 మందికి 11,68,00,750 రూపాయలు, రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కొత్తగా 717 పెన్షన్లు మంజూరు కాగా, మొత్తం 18,164 మందికి 5,06,71,000 రూపాయల లబ్ధి కలుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2022 నుంచి పెన్షన్ 2,500 రూపాయలు ఇస్తుండగా, జనవరి 2023 నుంచి 250 రూపాయలు పెంచి పెన్షన్ 2,750 రూపాయలను అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు వైఎస్సార్ పెన్షన్ కానుకను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.*


*ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు రూ.74.09 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ తదితరులు అందజేశారు. అనంతరం వైఎస్సార్ పెన్షన్ కానుక పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అధికారులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments