స్థానిక ప్రజల సహకారంతో యోగి వేమన జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 స్థానిక ప్రజల సహకారంతో యోగి వేమన  జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


కటారుపల్లి, జనవరి 18 (ప్రజా అమరావతి): స్థానిక ప్రజల సహకారంతో యోగి వేమన జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలిని  గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. బుధవారం గాండ్లపెంట మండలంలో  ఈనెల 19వ తేదీన కటారుపల్లిలో శ్రీ యోగి వేమన జయంతులు ఉత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు పనులను జిల్లా కలెక్టర్   బసంత కుమార్  పరిశీలించారు  సంబంధిత శాఖ అధికారులకు దిశ దిశ నిర్దేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  కటారుపల్లి జరిగే ఈ యోగి వేమన జయంతి ఉత్సవాలు ప్రజల సహకారంతో విజయవంతం కావాలని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల నందు ఎలాంటి  పొరబాట్లకు  జరగకుండా జాగ్రత్తగా కార్యక్రమాలు నిర్వహించాలని  సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రజా పరిషత్  ఉన్నత పాఠశాల నందు జరిగే సభ నందు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యటక మరియు సాంస్కృతుల శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా పాల్గొంటారని తెలిపారు. ప్రముఖుల రాకపోకల సంబంధించిన వాహనాలకు ప్రత్యేక స్థలాన్ని  కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేమన పద్యాలలో విశిష్ట  సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా  బహుమతులుప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.   సభ యందుత్రాగునీరు సౌకర్యము, ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులను  ఆదేశించారు.  రోడ్డు కిరువైపులా పటిష్టమైన భద్రత  కల్పించాలని  ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.  ఇతర స్థలాలను  అధికారులతో కలిసి పరిశీలించారు, యోగి వేమన సమాధి ఈరోజు సాయంత్రం లోపల సుందరంగా తీర్చిదిద్దాలి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వేమన జయంతిని ఈనెల 19వ తేదీన మొదటిసారిగా అధికారకంగా నిర్వహిస్తున్నందున ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  కదిరి ఆర్డీవో రాఘవేంద్ర,  పర్యటి శాఖ ఆర్ డి రామచంద్ర, కల్చరల్ సీఈవో మల్లికార్జున, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి,  డివిజనల్ టూరిజం అధికారి చంద్రమౌళి, ఎంపీడీవో అంజనప్ప, ఎమ్మార్వో రవి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి ఈ రషీద్,  డీఈఓ మీనాక్షి,ఇతర శాఖ అధికారులు, పుర ప్రముఖులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు


  

Comments