ఆప్కో స్టాల్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖా మంత్రి అమర్నాథ్

 *ఏపీ సచివాలయం ఆవరణలో ఆప్కో స్టాల్ ప్రారంభం*

*•ఆప్కో స్టాల్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖా మంత్రి  అమర్నాథ్


*

                                                                                                                                                                                                అమరావతి, జనవరి 12 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను  రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. మరియు చేనేత, జౌళి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం ప్రారంభించారు. స్టాల్ లో విక్రయాల కోసం ఉంచిన ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం తదితర ఫ్యాన్సీ చీరలతో పాటు పెడన కలంకారీ, పొందూరు ఖద్దరు వ్రస్తాలను మంత్రి సందర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ కు డిజైన్ ను  రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రతినిధులను మంత్రి అభినందిస్తూ వారిని దుశ్శాలువాతో సత్కరించారు. 


ఈ సందర్బంగా మంత్రి గడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ నూతన డిజైన్లతో కూడిన చేనేత వస్త్రాలను ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో  సంక్రాంతి కానుకగా ఈ స్టాల్ ను సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  దాదాపు నాలుగున్నర్ర దశాబ్దాల చరిత్ర కలిగిన ఆప్కో సంస్థకు చెందిన 90 వ స్టాల్ ను నేడు సచివాలయంలో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా నున్న 90 ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల మేర వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ఆప్కో సంస్థ పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా నున్న 900 కు పైబడి ఉన్న చేనేత కార్మిక సంఘాలను ప్రోత్సహించే విధంగా పలు రకాలుగా చేయూతనిచ్చే  కార్యక్రమాలను రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. నేతన్న నేస్తం పథకం క్రింద ఇప్పటికే రూ. 775 కోట్ల  మేర ఆర్థిక సహాయాన్ని చేనేత కార్మికులను అందజేయడం జరిగిందన్నారు.  చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున లబ్దిచేకూర్చాలనే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం చేనేత కార్మికుల పింఛను అర్హత వయస్సును 60 నుండి   50 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందన్నారు. ఫలితంగా  నేడు దాదాపు  లక్ష మంది చేనేత కార్మికులకు ఫించనును జగన్నప్రభుత్వం అందజేయడం జరుగుచున్నదని, ఇందుకై  ఇప్పటి  వరకూ  రూ.1,150 కోట్లను ఫించను రూపంలో చేనేత కార్మికులకు అందజేయడం జరిగిందన్నారు.  


చేనేత ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  ఒన్ డిస్ట్రిక్టు ఒన్ ప్రాడక్టు క్రింద  వీటన్నింటినీ  తీసుకురావడం జరుగుచున్నదన్నారు. త్వరలో  విశాఖపట్నంలో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ట్మెంట్ సమ్మిట్, జి-20   సదస్సుల్లో  కూడా  ఆప్కో ఉత్పత్తులను ప్రమోట్ చేసేలా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  విశాఖపట్నంలో కార్పొరేట్ స్థాయిలో ఒక ఆప్కో షోరూంను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా నున్న అన్ని ఆప్కో షోరూమ్ లను ఫేస్ లిప్టు చేసేందుకు కూడా చర్యలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. 

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆప్కో స్టాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును, అందులో ప్రదర్శనకు ఉంచిన లేపాక్షి, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను మంత్రి సందర్శించారు. 


రాష్ట్ర  హ్యండ్లూమ్ అండ్ టెక్సుటైల్స్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత, కమిషనర్ ఎం.ఎం.నాయక్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి  తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. 


 

Comments