జిల్లాలో ఫైలేరియా నిర్మూలన దిశలో సామూహిక ఔషధ పరిపాలన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):జిల్లాలో ఫైలేరియా నిర్మూలన దిశలో సామూహిక ఔషధ పరిపాలన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాల


ని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.


మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫైలేరియా నిర్మూలన పై ఎమ్. డి.ఏ.  సమావేశం సమన్వయ వైద్య అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ,  జిల్లాలో ఫైలేరియా కేసులు భవిష్యత్తులో ఒక్కటి కూడా నమోదు కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏ ఏ ప్రాంతాల్లో వ్యాధి ప్రబలే అవకాశాలు ఉన్నాయి అనే అంశంపై పూర్తి స్థాయి అధ్యయనం చేపట్టవలసి ఉందన్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 

"సామూహిక ఔషధ పరిపాలన" విధానాన్ని

జిల్లాలో పూర్తి స్థాయి లో అమలు కోసం ఫిబ్రవరి 10 న సమావేశం నిర్వహించ వలసి ఉన్న దృష్ట్యా ఆరోజు కు సమగ్ర అధ్యయం చేపట్టి సమావేశానికి హాజరు కావాలన్నారు. జనాభా ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా మందులు సిద్దం చేసుకొనే నివేదిక అందచెయ్యల్సి ఉందన్నారు. పీ.హెచ్. సి పరిధిలో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, సచివాలయం పరిధిలో 5 వ తేదీ నిర్వహించి, ఆ సమావేశాల్లో తీసుకున్న చర్యలపై జిల్లా స్థాయిలో సమావేమయ్యేందుకు సన్నద్ధం కావాలని మాధవీలత పేర్కొన్నారు.

 


Dec Tablet (Diethylcarbamazine Tablet)  అనేది శరీరంలోని పరాన్నజీవులు మరియు పురుగుల ముట్టడికి చికిత్స చేయడానికి ఉపయోగించే రెండు మందుల కలయిక తో మెడిసిన్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇది పరాన్నజీవుల పెరుగుదలను నిరోధించడం ద్వారా సంక్రమణ చికిత్సకు సహాయపడుతుంది. జిల్లాలో ఇప్పటికే రాజమహేంద్రవరం అర్బన్, కోరుకొండ , ధవళేశ్వరం బ్లాక్ పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం , మండపేట, పెద్దాపురం సబ్ యూనిట్స్ పరిధిలో కేసులు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.  ఫైలేరియా (బోధ) కేసులకు సంబంధించి 2596 మందికి కాళ్ళకు, 70 మందికి చేతులకు సోకిన భాదితులు ఉన్నట్లు తెలియచేశారు.


ఈ కార్యక్రమం లో డి. ఏం. హెచ్. ఓ, డా. కె. వెంకటేశ్వ రరావు, డి. టి. సీ. ఓ, ఎన్. వసుంధర, డి. సి. హెచ్. ఎస్. డా. సనత్ కుమారి,  డిప్యూటీ డియం హెచ్ ఓ లు, జి. వరల క్ష్మి, లూసి కోఆర్థిలి యా తదితరులు పాల్గొన్నారు.


Comments