కోడి పందేల, పేకాట స్థావరంపై దాడులు ముమ్మరం చేస్తున్నాము

 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం (ప్రజా అమరావతి);


*పండుగలు సందర్భంగా జిల్లాలో ఎవరైనా కోడిపందేలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము*


*కోడి పందేల, పేకాట స్థావరంపై దాడులు ముమ్మరం చేస్తున్నాము


.*


*కోడి పందేలలో పాల్గొనకుండా ఇప్పటి వరకు 645 మందిని బైండోవర్ చేసాము*


*బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు*


పండుగలు సందర్భంగా జిల్లాలో ఎవరైనా కోడిపందేలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు తెలిపారు. జనవరి 4 తేది బుధవారం  జిల్లా ఎస్పీ గారు కోడిపందేలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు గురించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే స్థావరాలను గుర్తించామన్నారు. ఆ ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పోలీస్‌ నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో గతంలో కోడి పందాలలో పాల్గొన్న వారిని గుర్తించి వారు మరల కోడి పందేలలో పాల్గొనకుండా ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేస్తున్నామని, ఇప్పటి వరకు రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో 431 మందిని, బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో 112 మందిని, చీరాల సబ్ డివిజన్ పరిధిలో 102 మందిని మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 645 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. ఇంకా మరికొంతమందిని బైండ్ ఓవర్ చెయ్యవలసి వున్నదని, వారిని కూడా త్వరలో బైండ్ ఓవర్ చేసి మరలా కోడి పందేలలో, ఇతర అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకుండా కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, పేకాట, కోడి పందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలలో ఎవరైనా పాల్గొంటే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పి గారు తెలిపారు.


బైండోవర్ మీరి ప్రవర్తించిన వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి చట్టపరంగా శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోడి పందాలు, పేకాట  వంటి ఇతర అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తుల ఆర్థికంగా నష్టపోతారని, తద్వారా కుటుంబ కలహాలు వస్తుంటాయని, సులభంగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు చెయ్యడానికి ఆస్కారం ఉంటుందని, వీటి వల్ల పరోక్షంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం వుంటుందని, కాబట్టి జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించుటలో ఏ చిన్న విషయంలో కూడా నిర్లక్ష్యం వహించమని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


జిల్లాలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రాపురం పంచాయతీ శివారులో కోడి పందేల స్థావరంపై మంగళవారం వేటపాలెం ఎస్సై సురేష్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారని, కోడి పందేలు ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని, 10 బైక్ లు, రూ.1200 నగదును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.


జె.పంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండమంజులూరు గ్రామ అంగన్వాడీ పాఠశాలలో జూదం అడుతున్నరన్న సమాచారంతో మంగళవారం  జె.పంగులూరు పోలీస్ స్టేషన్ ఎస్సై K.K.తిరుపతిరావు గారు, స్టేషన్ సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై రైడ్ చేసి పేకాట ఆడుతున్న వారిలో 6 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 2,970/-రూ.లు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.


చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామం ESR నగర్ రైస్ మిల్లు వెనుక జరుగుతున్న పేకాట స్థావరం పై సెబ్ అధికారులు దాడిచేసి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని, రూ.2500/-, స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.


జిల్లాలో కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని మరోసారి జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలను హెచ్చరించారు.

Comments