రాష్ట్ర ఏకసభ్య కమిషన్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కు వినతి.

 రాష్ట్ర ఏకసభ్య కమిషన్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కు వినతి.



మా రిజర్వేషన్లు యధాతధంగా ఉంచండి.


ఎస్టీ జాబితాలో బీసీ సామాజిక వర్గీల వారిని కలిపితే సహించం.


ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు.


చిలకలూరిపేట (ప్రజా అమరావతి); రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి,బోయ,బెంతో,ఒరియలాంటి బీసీ సామాజిక వర్గీలవారిని ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ శామ్యూల్ ఆనంద్ కుమార్( రిటైర్డ్) ఐఏఎస్ అధికారిని నియమించింది. అదేవిధంగా 52 జిఓను తీసుకురావడం జరిగింది. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 గిరిజన సంఘాల నాయకులు విజయవాడలోని గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కార్యాలయంలో బుధవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శామ్యూల్ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుత జనాభా శాతం ఎక్కువగా ఉన్న బీసీ సామాజిక వర్గీల వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వలన రిజర్వేషన్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు అన్నారు. ప్రస్తుతం చదువుతున్న యువత ఉద్యోరంగాలల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.52జీవోను రద్దు చేయాలన్నారు.ఇదే అంశాన్ని గత ప్రభుత్వాలు చేసి విరమించుకున్నారని అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్ శాతం పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగితే వారు ఆమోదం తెలప లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి 6 శాతం ఉన్న ఎస్టీలను రిజర్వేషన్నీ యధాతధంగా ఉంచి ప్రభుత్వానికి మా విజ్ఞప్తులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, గిరిజన విద్యార్థి సేన కె. పాండు నాయక్, పట్టణ గౌరవ అధ్యక్షులు బి.చిన్నా నాయక్, అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, యడ్లపాడు మండల అధ్యక్షులు శ్రీను నాయ, విద్యార్థి సేన నాయకులు అంజి నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments