దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉంది - ఎమ్మెల్యే ఆర్కే...


 *దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉంది - ఎమ్మెల్యే ఆర్కే...*


*దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు.*

దుగ్గిరాల (ప్రజా అమరావతి);

ఈ రోజు సాయంత్రం దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఫ్రేషర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని.. దేశ భవిష్యత్తును అది నిర్దేశిస్తుందని అన్నారు.


ప్రతి విద్యార్థి సహచర విద్యార్థులతో సోదర భావం కలిగి ఉండాలని , ఉన్నతమైన విద్య మన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుందని అన్నారు.


జీవితంలో యవ్వన దశ అత్యంత ప్రాముఖ్యమైనదని విద్యార్థి చెడు మార్గాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు..


విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడాలని ఆయన వారికి సూచించారు.


ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వైస్ చైర్మన్ సెక్రటరీలతో పాటు దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పిటిసి సభ్యురాలు మేకతోటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Comments