రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు దేశానికే ఆదర్శమయ్యాయ

 

నెల్లూరు  జనవరి 12 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు దేశానికే ఆదర్శమయ్యాయ


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.


గురువారం సాయంత్రం నెల్లూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల అసోసియేషన్ వారి నూతన సంవత్సర డైరీ, కాలెండర్ ను మంత్రి కాకాణి ఆవిష్కరించారు.


అనంతరం వ్యవసాయ అధికారులనిద్దేశించి మంత్రి కాకాణి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు గ్రామ స్థాయిలో నూతన వ్యవస్థ ఏర్పడటం వల్ల రైతులకు సంబంధించిన అన్ని సేవలు అందించటానికి అవకాశం ఏర్పడిందన్నారు. వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఆర్ బి కే ల పనితీరును చూసి బ్రిటిష్ హై కమీషనర్ సైతం ప్రశంసించారన్నారు. ఈ క్రాప్ నమోదు ద్వారా రైతులకు అనేక సౌకర్యాలు ఒనగూరుతున్నాయన్నారు. రైతుల సేవలో కీలకంగా వ్యవహారిస్తున్న వ్యవసాయ అధికారుల సమిష్టి కృషి వల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయన్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ఉండి శాఖ ద్వారా రైతులకు విశేష సేవలందిస్తున్న వ్యవసాయ శాఖ లోని సిబ్బంది సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.


అదేవిధంగా చిరుధాన్యాలను ప్రోత్సాహించేందుకు బడి పిల్లలకు వారానికి మూడు రోజుల పాటు రాగిజావ అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకు ప్రేరణగా సర్వేపల్లి నియోజకవర్గం నిలవడం సంతోషకరమన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖధికారి సుధాకర్ రాజు, రాష్ట్ర వ్యవసాయ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు బాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


    Comments