ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, పశుసంవర్ధక శాఖ,
మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్, విజయవాడ (ప్రజా అమరావతి);
రాష్ట్రములో మాంస ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఔత్సాహిక పరిశ్రామికవేత్తల సమావేశము
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాంస ఉత్పత్తి రంగ అభివృద్ధికై ఆంధ్ర ప్రదేశ్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ మరియు పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ యం. శ్రీరాములు గారు అధ్యక్షత వహించారు మరియు ముఖ్యతిధులుగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డా. ఆర్. అమరేంద్ర కుమార్ గారు హాజరయ్యారు. అలాగే మానేజింగ్ డైరెక్టర్, డా. యం. విజయుడు గారి నేతృత్వములో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మాంస ఉత్పత్తి పరిశ్రమలు అయిన లీషియస్, కంట్రీ చికెన్, శ్రీనివాస ఫారమ్స్, అల్ సమి ఆగ్రో మరియు మీట్ ప్రోడక్ట్స్, లాహామ్ ఫుడ్ ప్రోడక్ట్స్, వైజాగ్ పుడ్స్, ఫోర్క్ జా మొదలగు సంస్థల వారు ఈ సమావేశములో పాల్గొని ఛైర్మన్ గారి పవర్ ప్రెసెంటేషన్ విని వారి రాష్ట్రములో తమ పరిశ్రమలు స్థాపించుటలో గల సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గారు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వము తరుపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. అదే విధముగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్ర కుమార్ గారు ప్రసంగిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తరుపున అవసరమైన సాంకేతిక సహకారాన్ని వారికి అందిస్తామని తెలియజేశారు.
addComments
Post a Comment