గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు.

 *గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు* 


విజయవాడ, జనవరి 26 (ప్రజా అమరావతి):

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వబ్యూషన్ హరిచందన్ ల సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 13 అలంకృత శకటాలు తమ తమ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించాయి. ఉత్తమ శకటాల ఎంపికకై ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, మునిసిపల్ శాఖ విశ్రాంత డి ఈ జెట్టి రామకృష్ణ మోహన్ రావు, ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులు డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.


 ఇక గృహ నిర్మాణ శాఖ, డిజిటల్ విద్యాబోధన, గ్రామ, వార్డు సచివాలయాల శకటాలు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించగా.... రాష్ట్ర గవర్నర్ ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులను అభినందిస్తూ అవార్డులు అందజేశారు.


 రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జాయింట్ డైరెక్టర్ లు పోతుల కిరణ్ కుమార్, శ్రీమతి టీ కస్తూరిబాయ్ వారి సిబ్బంది పర్యవేక్షించారు.

Comments