ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారుల కుటుంబాలు ముందుకు రావాలి

 కొవ్వూరు (ప్రజా అమరావతి);




** నవరత్నాలు పేదలకు ఇళ్ళు పధకంలో  జిల్లాలో  14 వేల 223 ఇళ్ళు  పూర్తి అయ్యాయి



**  చీపురు పల్లి రమాదేవి-రాజు దంపతు ల ఇంటికి శఖుస్థాపన కార్యక్ర మంలో పాల్గొన్న జిల కలెక్టర్ 


**  ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారుల కుటుంబాలు ముందుకు రావాలి





** సొంత ఇంటికి రండి.. మౌలిక వసతులు కల్పిస్తాం... 


.. జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీ లత.


నవరత్నాలు పేదలకు ఇళ్ళు పధకం లో భాగంగా జిల్లా లో ఇప్పటి వరకు 56 వేల 771 ఇ ళ్ళు మంజూరు  చెయ్యగా, వాటిలో  53 వేల 949 ఇళ్ళ నిర్మాణాలు మొదలు పెట్టడం జరిగిందని జిల్లా కలె క్టర్ డా కే. మాధవీలత  పేర్కొ న్నారు. వీటిలో ఇప్పటి వరకు 14 వేల 223 మంది లబ్దిదారుల ఇళ్ళు పూర్తి అయ్యాయన్నారు.




శనివారం స్థానిక కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని జగనన్న లే అవుట్ ను ఆకస్మికంగా పర్యటించారు.  చీపురు పల్లి రమాదేవి, రాజు దంపతుల ఇంటి శఖుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. మాధవిలత పాల్గొన్నారు. 


ఈ సందర్భం గా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వటమే కాకుండా, ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూత తో పాటుగా ఇసుక, సిమెంట్, ఐరన్, నీటి వనరులు ఆయా లే అవుట్ వద్దనే గృహాలు నిర్మించుకునే లబ్దిదారులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా చేయూతను ఇస్తున్న ట్లు తెలిపారు.  అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ప్రభుత్వం ఇంత మంచి స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టుకోండని చెపుతోందని, మీ తరువాత మీ తదుపరి తరాలకు ఒక ఆస్తి అందించటానికి ఇది ఒక చక్కటి అవకాశమని మాధవీలత పేర్కొన్నారు. పూర్తి చేసిన ఇండ్లకు  విద్యుత్ సరఫరా కూడా ఇవ్వ డం జరుగుతోందన్నారు.  గతంలో ఎన్నడూ ఇలా లబ్ధిదారులను ప్రోత్సహించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. లబ్ధిదారులకు అవసరమైతే అదనపు బ్యాంకు రుణాలు మంజూరు కి చర్యలు తీసుకోవాలని  ఇప్పటికే అధికారులను, బ్యాంకర్ల ను  ఆదేశించారు.  కొవ్వూరు అర్బన్ లో 2830 మందికి ఇళ్ళు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 198 మంది మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు.  మిగిలిన ఇళ్ళు వివిధ నిర్మాణ దశ ల్లో ఉన్నాయని అన్నారు. లే అవుట్ ల్లో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, త్రాగు నీటి పైపు లైన్లు లీక్ అవ్వకుండా మరమ్మత్తులు చేయాలని మునిసిపల్ కమీషనర్, బి. శ్రీకాంత్ ను కలెక్టర్ ఆదేశించారు.  


లబ్ధిదారులతో కలెక్టర్ ముఖాముఖి : 


వేండ్ర సునీత, లబ్ధిదారుల ఇళ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్వంత ఇంటిని ఇంత చక్కగా నిర్మాణం చేసుకుని ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.  నీటి వసతి గురించి ఆలోచిస్తున్నామని, తెలుపగా, మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రతి రోజు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.  మీరు కట్టుకున్న ఇంట్లోకి రావాలనీ, ప్రతి నెలా రూ.4 వేల అద్దె మిగులుతుంది అని పేర్కొన్నారు. అన్ని విధాలా అధికారులు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.  అదే విధంగా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులకు ఇళ్ళు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. తదుపరి చీపురుపల్లి రమాదేవి-రాజు దంపతు ల ఇంటికి శఖుస్థాపన కార్యక్ర మంలో పాల్గొన్న జిల కలెక్టర్ వారిని అభినందించి, త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చెయ్యాలని, అవసరమైన సహాయం కోసం అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మిమ్మల్ని చూసి మరింత మంది ముందుకు వచ్చేలా ఉండాలని తెలిపారు.



ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్, భావన రత్నకుమారి, ఇంచార్జి జిల్లా హౌసింగ్ అధికారి జి. పరశురామ్, కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లిబాబు, హౌ సింగ్, ఎ. పి. ఈ. పి. డి. సి. ఎల్, పి. అచ్యుతాచారి, హౌ సింగ్ డీఈ, ఎం. శ్రీనివాసరావు  , మండల తహసిల్దారు బి. నాగరాజు నాయక్, కౌన్సిలర్లు,  మునిసిపల్,  పంచాయతీ,  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు.



Comments