వైఎస్ జగన్ కు అధికారం...పిచ్చోడి చేతిలో రాయి*వైఎస్ జగన్ కు అధికారం...పిచ్చోడి చేతిలో రాయి


*


*రాష్ట్రానికి చెడు చేస్తున్న చెడ్డ పార్టీ వైసిపి....అందులో ఉండొద్దు!*


*మంగళగిరి టీడీపీలో చేరికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు*


అమరావతి (ప్రజా అమరావతి):- రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని భూ స్థాపితం చెయ్యాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్రాన్ని తీవ్ర అంధకారంలోకి నెట్టివేశారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసిపి నేత, దుగ్గిరాల మాజీ ఎంపిపి వెనిగెళ్ల కృష్ణ ప్రసాద్ తెలుగు దేశం పార్టీలో చేరారు.ఆయనతో పాటు దాదాపు 100 మంది దుగ్గిరాల మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరితో పాటు కృష్ణాయపాలెం, ఉండవల్లి, తుమ్మపూడి గ్రామాలకు చెందిన దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....వైసిపి ప్రభుత్వంలో బడుగు వర్గాలకు తీవ్రనష్టం జరుగుతోందని అన్నారు. ఎస్సిలకు టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేశారని అన్నారు. అన్ని వర్గాలను దెబ్బతీసి...రాష్ట్రానికి చెడు చేస్తున్న చెడ్డ పార్టీ అయిన వైసిపిలో ఎవరూ ఉండవద్దని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం కోసం, యువత భవిత కోసం అంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆ రాయిని రాష్ట్రంపై విసురుతున్నారని అన్నారు. సైకో పాలకుల చేతిలో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో ప్రజలంతా అర్ధం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని నేడు సిబిఐ విచారిస్తుందని....దీంతో టెన్షన్ లో పడిన జగన్... నిందితులను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments