పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి అంతర్గత సమ్మతి కమిటీ ఏర్పాటు


విజయవాడ (ప్రజా అమరావతి);


          


పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి  అంతర్గత సమ్మతి కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.


 కమీషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్, A.P., కార్యాలయంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం & పరిష్కారాలు) చట్టం, 2013లోని రూల్ 4 (1) ప్రకారం (3) మహిళా ఉద్యోగులతో కూడిన అంతర్గత సమ్మతి  ఏర్పాటు చేయబడం జరిగిందన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడి  దేవాదాయ శాఖలో మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు

 పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం & పరిహారం) చట్టం, 2013లోని రూల్ 4 (1) ప్రకారం  సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

ప్రధాన కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్ కె. శోభారాణి, గెజిటెడ్ సూపరింటెండెంట్ ఎస్. వెంకట లక్ష్మీ, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా ఎండోమెంట్స్ అధికారి టి. అన్నపూర్ణ లతో కూడిన కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేడర్‌లలోని దేవాదాయ శాఖలోని మహిళా ఉద్యోగులందరూ తమ ఫిర్యాదులు ఏవైనా ఉంటే నేరుగా కమిటీకి తెలియజేయవచ్చనని అన్నారు.  మహిళా ఉద్యోగుల నుండి ఏవైనా ఫిర్యాదులు/ప్రాతినిధ్యాలు స్వీకరించినప్పుడల్లా, కమిటీ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం & పరిష్కారం) చట్టం, 2013 మరియు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం  చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులు,  ఎగ్జిక్యూటివ్ అధికారులు ఉత్తర్వులను   ఉద్యోగులందరికీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు తెలపాలని దేవాదాయ శాఖ కమీషనర్ ఈ ప్రకటనలో తెలిపారు.


Comments