వీరందరికీ జగనన్న తోడు...:*చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం.*


*నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడాలన్న సదుద్ధేశంతో.. జగనన్న తోడు పథకం.*


*నేడు (11వ తేదీ, బుధవారం) జగనన్న తోడు పథకం.*

*చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం.*


*పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395  కోట్లు కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*అమరావతి (ప్రజా అమరావతి);


*వీరందరికీ జగనన్న తోడు...:*

గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడగులు పొడవు, 5 అడుగులు వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు.

పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్‌, మోటారు సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో  పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు... ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బమ్మల తయారీ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు. 


*జగనన్న తోడు పథకం...*

సుదీర్ఘ పాదయాత్రలో ఈ చిరు వ్యాపారుల కష్టాలను చూసిన, వారి కడగండ్లను స్వయంగా విన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆ పరిస్థితులను మారుస్తూ, నిత్య కష్టంపైనే ఆధారపడి, గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం, సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు.


*దేశంలోనే అత్యధిక రుణాలు...*

దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న వైయస్‌.జగన్‌ ప్రభుత్వం.

నేడు(బుధవారం, 11–01–2023) అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు అందించిన వడ్డీలేని రుణాలు రూ.2,406 కోట్లు.

వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందిన వారు 8,74,745 మంది. 


నేడు (11–01–2023) అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.63.65 కోట్లు.


ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తీసుకున్న చురుకైన చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం అందుబాటులో మూలధనం. 


ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా చర్యలు.

Comments