కోర్ట్ మానిటరింగ్ సిస్టం సమర్ధవంతం గా పని చేయాలి

 

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం. (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్  డీజీపీ శ్రీ K.V.రాజేంద్రనాథ్ రెడ్డి   ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం కు విచ్చేసినారు.


డీజీపీ గారిని సాధారంగా ఆహ్వానించిన ఏలూరు రేంజ్ IG శ్రీG.పాలరాజు IPS, మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ యు.రవి ప్రకాష్ IPS .


విష్ణు కాలేజీ అడ్మిన్స్ట్రటివ్ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా  సమీక్షా సమావేశం ను నిర్వహించారు.


సమీక్షా సమావేశం లో జిల్లా ఎస్పీ  సమావేశం ను కు వచ్చిన అధికారులు అందరు ని డీజీపీ గారికి పరిచయం చేసారు, తరువాత జిల్లా ఎస్పీ  పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా జిల్లా కొత్త గా ఏర్పాటు అయినా తరువాత సబ్ డివిజన్ ల,స్టేషన్ ల వివరాలు మరియు జిల్లా లోని ప్రాపర్టీ కేసుల వివరాలు, గ్రేవ్ కేసులు, క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్ కేసులు మరియు రోడ్ ప్రమాదాల కేసులు గురుంచి, మరియు రోడ్ ప్రమాదాలు నివారణకు తీసుకునే చర్యలు, దిశా అప్ వినియోగం, డౌన్లోడ్ ల గురుంచి గంజాయి అరికట్టి డానికి చేపట్టిన చర్యలు, సారా నిర్ములన కు తీసుకున్న చర్యలు గురుంచి తెలియజేసారు.


అనంతరం డీజీపీ  మాట్లాడుతు జిల్లా కొత్తగా ఏర్పాటు అయ్యింది అని ప్రాపర్టీ నేరాలు రికవరీ బాగుంది అని, రోడ్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు గురుంచి చెప్పారు, అదే విధంగా కోర్ట్ మానిటరింగ్ సిస్టం సమర్ధవంతం గా పని చేయాల


నీ కోర్ట్ మానిటరింగ్ సిస్టం ను జిల్లా హెడ్ క్వార్టర్ లో, సబ్ డివిజన్లో, సర్కిల్ లో ఏర్పాటు చేయాలనీ ప్రతి సబ్ డివిజన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, మరియు సబ్ ఇన్స్పెక్టర్ తన పరిధిలో పెండింగ్ ట్రయిల్ కేసులు 10 తీసుకొని వాటి  విచారణ వేగవంతం చేసి ముద్దాయి కు త్వరగా శిక్ష పడే ల చూడాలి అని ఆదేశించారు.


దిశా కేసులు ల లో త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాకలు చేయాలనీ ముద్దాయి కు శిక్ష పడేల చూడాలని ఆదేశించారు, రాష్టం లో గత 6 నెలలు లో 40 దిశా కేసులు ల లో ముద్దాయి లు కు శిక్ష పడింది అని చెప్పారు.


గంజాయి ను రాష్టం లో గత సం 7500 ఎకరాల గంజాయి పంట ను నాశనం చేసాం, ఇంకా ఈ సం లో 600 ఎకరాల పంట ను గుర్తించడం జరిగింది వాటిని త్వరలో డిస్ట్రాయ్ చేస్తాం. గంజాయి సాగు చేసే వారిని గుర్తించి వారిని ఆ సాగు వైపు వెళ్లకుండా ప్రభుత్వం సహాయం తో వేరే వాణిజ్య మరియు ఆహార పంటలు పండించే విధంగా వారి లో మార్పు తేవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.


ఈ సమావేశం ను కు ఏలూరు రేంజ్ IG శ్రీ పాలరాజు , జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ AV. సుబ్బరాజు , SEB అడిషనల్ ఎస్పీ ATV. రవి కుమార్ , భీమవరం డీస్పీ శ్రీనాథ్ , నర్సాపురం డీస్పీ మనహోర్ చారి  మరియు జిల్లా లోని ఇన్స్పెక్టర్ లు సబ్ఇన్స్పెక్టర్ లు సిబ్బంది పాల్గొన్నారు.

Comments