రాష్ట్ర సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు-ప్రతిజ్ణ

 రాష్ట్ర సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు-ప్రతిజ్ణ


అమరావతి:25 జనవరి (ప్రజా అమరావతి):ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రక్రియలో భాగంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను,ప్రతిజ్ణ కార్యక్రమాన్నినిర్వహించారు.వయోజనుల్లో ఓటు హక్కు వినియోగం దాని ఆవశ్యకతపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.అంతేగాక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని భాహ్య ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఈజాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.ఈకార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ పాల్గొని అధికారులు,సిబ్బందితో భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ఫ్రాభవాన్నినిలబెడతామని,మతం,జాతి,కులం,వర్గం,భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ణ చేస్తున్నామని ఆయన అందరితో ప్రతిజ్ణ చేయించారు.

ఈకార్యక్రమంలో సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తో పాటు డిప్యూటీ సెక్రటరీలు రామసుబ్బయ్య,శ్రీనివాస్,జిఏడి,ఇతర విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

      

Comments