బాల బాలికలు ఇద్దరికీ సమాన హక్కుల అందించాలి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 బాల బాలికలు ఇద్దరికీ సమాన హక్కుల అందించాలి


జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్పుట్టపర్తి, జనవరి 24 (ప్రజా అమరావతి): బాల బాలికలు ఇద్దరికీ సమాన హక్కుల అందించాలి అని జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్  పేర్కొన్నారు

మంగళవారం కలెక్టరేట్లోనే  కలెక్టర్ ఛాంబర్ నందు  విద్య ,మరియు వైద్య ఆరోగ్యము , మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది. 

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల బాలికలు ఇద్దరికీ సమాన హక్కుల అందించాలని, బాల్యంలో బాల బాలికలకు సమానంగా ఇంటికి పనులు కూడా నేర్పించాలని అన్నారు మన జిల్లాలో జాతీయ బాలిక వారోత్సవాలను ఈనెల 18 వ తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించుకుంటున్నామని ఈ వారోత్సవాలను సంబంధిత శాఖల వారందరూ ప్రజలకు అవగాహన కల్పించి ఆడపిల్లలను రక్షించుకుందాం - ఆడపిల్లలను చదివించుకుందామన్నారు. బాలికలను కూడ ఉన్నత విద్యను  అభ్యసించేలా చూడాలన్నారు లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములనైన నిరోధించుటకు అందరం ప్రయత్నం చేయాలని కలెక్టర్  పేర్కొన్నారు.గత వారం రోజుల నుండి కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో  జాతీయ బాలిక దినోత్సవంపురస్కరించుకొని.వ్యాసరచన,చిత్రలేఖనం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా 140 మంది దాకా పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో   9మంది తమ ప్రతిభ  ప్రదర్శించినందుకు గాను నేడు జిల్లా కలెక్టర్ వారందరినీ అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అలాగే ప్రథమ రూ.10,000/లను స్వప్న 9వ తరగతి జడ్పిహెచ్ స్కూల్  చిలమత్తూరు వక్తృత్వపు పోటీలో విజేతగా నిలిచారు. అలాగే సాయి సంజన జడ్పీహెచ్ స్కూల్ కేసాపురం 10వ తరగతి చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ విజేతగా, అలాగే  వ్యాసరచన  పోటీల్లో ధర్మవరం లోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ కు చెందిన పదో తరగతి విద్యార్థిని నందిని ప్రధమ స్థానం విజేతగా నిలిచారు.  వక్తృత్వ పోటీల్లో లేపాక్షి సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న  స్వాతిక్ ద్వితీయ స్థానం లో రూ.5000/  లు  పొంది విజేతగా నిలిచారు. చిత్రలేఖనం పోటీలో ద్వితీయ బహుమతిని  హిందూపురం ఎంజీఎం స్కూల్ కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినీ హాజీర విజేతగా నిలిచింది . వ్యాసరచన పోటీల్లో సాంఘిక సంక్షేమ శాఖ లేపాక్షి పాఠశాలలో పదో తరగతి చెందుతున్న చందు విద్యార్థి  ద్వితీయ బహుమతి పొందారు.  అలాగే వ్యాసరచన తృతీయ బహుమతిని యశ్వంత్ కుమార్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కొత్తచెరువు 9వ తరగతి విద్యార్థి రూ. 3000/పొంది విజేతగా నిలిచారు.  చిత్రలేఖనం లో ఏపీ మోడల్ స్కూల్ ధర్మవారానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని మీనాక్షి వ్యాసరచన పోటీలో కోడూరు జడ్పీహెచ్ఎస్ స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థి నరేంద్ర కు నగదు పారిషితోక బహుమతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ వి కృష్ణారెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ కుమారి, డి ఐ ఓ డాక్టర్ డి కృష్ణయ్య, డిపిఎం కుళ్లాయప్ప, హెల్త్ ఎడ్యుకేటర్ రామలక్ష్మి,  విజయ, పుట్టపర్తి పిహెచ్ సి,ఆశా వర్కర్ లు ఏఎన్ఎం లు  తదితరులు పాల్గొన్నారు.


Comments