ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరిగా వేయాలి.

 ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరిగా వేయాలి*


*స్పందన అర్జీలు  బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా పరిష్కరించాలి* 


*యుధ్ద ప్రాతిపదికన ఆయుష్మాన్ భారత్ ఈకేవైసీ పూర్తి చేయండి*


*గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్ చేయాలి*


*జిల్లా కలెక్టర్   బసంత కుమార్



పుట్టపర్తి, జనవరి 30. (ప్రజా అమరావతి);  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని   స్పందనలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి, జిల్లా కలెక్టర్   బసంత కుమార్  స్పందన కార్యక్రమం  నిర్వహించారు. జిల్లాలో నలుమూలల నుండి ప్రజలు విరివిగా తరలివచ్చి  166 వినతలను  జిల్లా కలెక్టర్ స్వీకరించారు.స్పందన అర్జీలు గడపగడపకు మన ప్రభుత్వం, సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్. ఆయుష్మాన్ భారత్, తదితర అంశాలపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో  డిఆర్ ఓ  కొండయ్య, పుట్టపర్తి ఆర్డివో భాగ్య రేఖ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... రీ-సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. ఈ పనులను ఆర్డీవోలు, తహసిల్దార్లు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.  ముటేషన్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేసిందని ఉద్యోగులందరూ ఎపిఎఫ్ఆర్ఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ముఖ ఆధారిత హాజరు వేయాలన్నారు.స్పందన అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ఎ లోకి వెళ్లకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎలోని దరఖాస్తులన్నింటినీ వేగంగా  పరిష్కరించాలని పరిష్కారంకాని సమస్యలకు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయాలన్నారు. లేని పక్షంలో మల్లీ అవే సమస్యలుపునరావృతమయ్యేఅవకాశముందన్నారు

యుద్ధ ప్రాతిపదికన  ఆయుష్మాన్ భారత్ ఈ కేవైసీ పూర్తి చేయించాలని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలోని సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పకుండా వంద శాతం వేసే విధంగా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తగు పర్యవేక్షణ ఉండాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చేసిన పనులకు సంబంధించి ఎ ప్పటికప్పుడు బిల్ల్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఎంపీడీవోలకు సూచించారు.  క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కొరకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని తహసిల్దార్లకు సూచించారు. 


సోమవారం జరిగిన ప్రజా స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలతో కూడిన అర్జీలను సమర్పించారు. ఇందులో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.


నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామ నివాసి జి చెన్నకేశవులకు చెందిన సర్వే నంబర్ 1300/2 లో 3. 79 సెంట్ల భూమిని కౌలు నిమిత్తం ఇచ్చారని అయితే మరో వ్యక్తి ఆ భూమిని తన పేరుమీద మార్చుకున్నాడని ఈ విషయంలో తనకు న్యాయం చేయవలసిందిగా  తెలుపుతూ ఫిర్యాదు చేశాడు.


గోరంట్ల మండలానికి చెందిన వాండ్లపల్లి గ్రామ నివాసి అయిన రేష్మ భాను జగనన్న కాలనీ లేఔట్లలో ఇంటి నిర్మాణం చేపట్టిందని గత 11 నెలలుగా ఎలాంటి బిల్లులో మంజూరు కాలేదని పేర్కొంటూ వినతి సమర్పించింది.


కొత్తచెరువు మండలం పల్లి గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి కి సంబంధించి సర్వేనెంబర్ 7/4 లో 9.35 సండ్ల భూమిలోఇతరుల రాస్తాను ఏర్పాటు చేసుకున్నారని ఈ విషయమై సర్వేచేయవలసిందిగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని పేర్కొంటూ అర్జీని సమర్పించాడు. 


 రోళ్ల మండలం  కాలువే పల్లి గ్రామానికి  చెందిన భీమప్ప  ఇల్లు కూలిపోయిందని దీని స్థానంలో   కొత్త ఇంటి నిర్మాణానికి వెళ్ళినప్పుడు  ఆ స్థలాన్ని మరొకరు ఆక్రమించుకున్నారని తనకు న్యాయం చేయవలసిందిగా వినతిని సమర్పించారు.


 ఆమడగూరు చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ తన పొలం సర్వే నంబర్ 460/ఎ2 లో  రాస్తా కొరకు  తగు చర్య నిమిత్తం అనుమతి మంజూరు చేయవలసిందిగా వినతిని సమర్పించారు.



 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, పిఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిసి హెచ్ఓ  తిపేంద్రనాయక్, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఇంచార్జి డిఈఓ మీనాక్షి, ఆరోగ్యశ్రీ అధికారి యల్లప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments