తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార శాఖా మంత్రి*తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార శాఖా మంత్రి*తిరుపతి, జనవరి22 (ప్రజా అమరావతి): ఆదివారం రాత్రి తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న  గౌ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి స్వాగతం పలికిన ఆలయ ఏఈఓ ప్రభాకర్ రెడ్డి ఆలయ అర్చకులు. మంత్రి దంపతులు ముందుగా ధ్వజస్తంభమునకు మొక్కి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఏ ఈ ఓ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు.


అమ్మవారి దర్శనానికి ముందు ఆలయం వద్ద  సాదర స్వాగతం పలికిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మరియు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి భాస్కర్ రెడ్డి. 


Comments