రావి నాయకత్వంలో “సైకో పోవాలి, సైకిల్ రావాలి” ప్రారంభం.

 *- రావి నాయకత్వంలో “సైకో పోవాలి, సైకిల్ రావాలి” ప్రారంభం* 


 *- గుడివాడలో తెలుగుదేశం జెండాను ఎగురవేస్తా* 

 *- యువగళం పాదయాత్రను జయప్రదం చేయండి* 

 *- మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిలుపు*గుడివాడ, జనవరి 12 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నాయకత్వంలో “సైకో పోవాలి, సైకిల్ రావాలి" అంటూ వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా స్థానిక నీలామహల్ రోడ్డులోని శ్రీవిజయదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా "సైకో పోవాలి, సైకిల్ రావాలి" అంటూ టిడిపి శ్రేణులతో కలిసి 108సార్లు నినాదాలు చేయడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ గత 20ఏళ్ళుగా గుడివాడ పట్టణానికి పట్టిన కొడాలి నాని శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. సైకో పాలన నుండి ప్రజలను విముక్తులను చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలో పోరాడతామని తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో రావి మాట్లాడుతూ ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ముసుగులో ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాపారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలతో పాటు జూదం వంటివి కూడా జరుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ పేరును చెడగొడుతున్నారని, ఆ పేరును తలచుకోడానికి కూడా అర్హత లేదన్నారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును కూడా తొలగించారన్నారు. ఎంతో పట్టుదలతో దేశంలోనే తలమానికమైన హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ విజయవాడలో నెలకొల్పారని గుర్తుచేశారు. దీనికి దివంగత రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. గత 20 ఏళ్లుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే జరుగుతోందన్నారు. ప్రజలు తమ జీవితాలు బాగుపడతాయన్న ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని చెప్పారు. గుడివాడ ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గుడివాడలో తెలుగుదేశం జెండాను ఎట్టి పరిస్థితుల్లో ఎగురవేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నారు. తెలుగుదేశం హయాంలోనే గుడివాడలో పేదలకు 10వేల ఇళ్ళను కేటాయించామని, 95శాతం నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టిని తరలించి రూ.కోట్లు దోచుకున్నారన్నారు. గుడివాడలో జరిగిన దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు, భూకబ్జాలు, అసాంఘిక కార్యక్రమాలను అరికడతానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, దీనిద్వారా యువతలో భరోసాను నింపనున్నారని తెలిపారు. గత నాలుగేళ్ళ పాలనలో యువత పూర్తిస్థాయిలో మోసపోయిందన్నారు. యువత కష్టాలను తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపైనే యువగళం పాదయాత్ర జరుగుతోందన్నారు. ఈ పాదయాత్రకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. గుడివాడలో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఆస్థులను కూడా నష్టపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తానని రావి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, పోలాసి ఉమామహేశ్వరరావు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, గోకవరపు సునీల్, షేక్ జానీ షరీఫ్, వేణుబాబు, ముళ్ళపూడి రమేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Comments