మాజీ ఎమ్మెల్యే రావి ఆధ్వర్యంలో వేలాది మందితో "ఎన్టీఆర్ టూ ఎన్టీఆర్"

 *- మాజీ ఎమ్మెల్యే రావి ఆధ్వర్యంలో వేలాది మందితో "ఎన్టీఆర్ టూ ఎన్టీఆర్"


 *- గుడివాడ నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు*

 *- నాగవరప్పాడు నుండి స్టేడియం వరకు పాదయాత్ర*

 *- ఎన్టీఆర్ కాంశ్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రావి నివాళి*

 *- టీడీపీ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో భోజన ఏర్పాట్లు*


గుడివాడ, జనవరి 18 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ టూ ఎన్టీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా వేలాదిమంది టిడిపి కార్యకర్తలు, నాయకులతో పాదయాత్ర జరిగింది. ముందుగా 

గుడివాడ పట్టణం నాగవరప్పాడులోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రావి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడనుండి టిడిపి శ్రేణులతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. నాగవరప్పాడు వంతెన, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, మార్కెట్ సెంటర్, వాసవీ చౌక్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం మొదటి గేటు దగ్గర నుండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రావికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తల నడుమ జోహార్ ఎన్టీఆర్ అంటూ మాజీ ఎమ్మెల్యే రావి నినదించారు. అక్కడ ఎన్టీఆర్ కాంశ్య విగ్రహానికి రావి గజమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. గుడివాడ పట్టణం, రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావి నాయకత్వంలో జరిగిన పాదయాత్రకు తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. అనంతరం వేలాదిమంది కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి మెయిన్ రోడ్ లోని  తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి స్వయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలు వడ్డించారు. టీడీపీ శ్రేణులు భోజన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకుముందు గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేతలు దింట్యాల రాంబాబు, వాసే మురళి, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, ముళ్ళపూడి రమేష్ చౌదరి, సన్యాసిరావు, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్  శాయన పుష్పావతి, టీడీపీ మాజీ కౌన్సిలర్లు శొంఠి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పొట్లూరి వెంకట కృష్ణారావు, మైనార్టీ నాయకులు షేక్ జబీన్, ముజాహిద్దీన్, జానీ, టిడిపి మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి,బీ లక్ష్మి, కాపు నాయకులు పోలాసి ఉమామహేశ్వరరావు, పండ్రాజు సాంబశివరావు, దారపురెడ్డి శేష్ కుమార్, పట్టపు చిన్నా, వంగపండు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments