ప్రజల అభివృద్ధి సంక్షేమమేప్రభుత్వ ప్రధాన ధ్యేయం *ప్రజల అభివృద్ధి సంక్షేమమేప్రభుత్వ ప్రధాన ధ్యేయం*ప్రజల ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలను అందించేందుకు సచివాలయ వ్యవస్థను అమలు చేయడం జరుగుతున్నది*


*: గౌ.రాష్ట్ర  విద్యుత్,అటవీ, శాస్త్ర,సాంకేతిక, పర్యావరణ,  భూగర్భ గనులు శాఖా మాత్యులు*

  

సదుం, జనవరి 10 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలను అందించేందుకు సచివాలయ వ్యవస్థను అమలు చేయడం జరుగుతున్నదని గౌ. రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణ,   శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖా మాత్యులు శ్రీ డా.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.


పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో రెండవ రోజు మంగళవారం పల్లె బాట కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి వర్యులు. 


ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను ప్రారంభోత్సవం గావించారు. 

 

   *ప్రాధాన్యతా భవనాల ప్రారంభోత్సవ వివరాలు :*

 

బూరగమంద గ్రామ పంచాయతీ 

 

సీతన్నగారి పల్లిలో రూ.40.00 లక్షలతో సచివాలయం, మొరవపల్లిలో రూ.8.5 లక్షలతో  అంగన్వాడీ కేంద్రం, బూరగామందలో రూ.17.50 లక్షలతో  డా.వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్,రూ.8.5 లక్షలతో అంగన్వాడీ కేంద్రం, దేవదారుమాకులపల్లిలో రూ.8.5 లక్షలతో అంగన్వాడీ కేంద్రం. 


కొత్త వడ్డి పల్లి లో 18 మంది రైతులకు అనుభవ పత్రాలను అందించారు.


*జోగివారి పల్లి గ్రామ పంచాయతీ* జోగివారిపల్లిలో రూ.21.80 లక్షలతో ఆర్ బి కే 


*నడిగడ్డ గ్రామ పంచాయతీ*


 నడి గడ్డ లో రూ.17.50 లక్షలతో డా.వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ సదుం మండలంలో రెండో రోజు పర్యటన బూరగ మంద గ్రామ పంచాయతీ  గంటా వారి పల్లి తో ప్రారం భం కాగా నడిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని వేణు గోపాలపురం తో పూర్తికానున్నది. నేడు 41 పల్లె లలో పల్లె బాట జరగ నుంది.


                ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర  ముఖ్యమంత్రి వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి  ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయం గా పాలన సాగిస్తు న్నారని తెలిపారు. తన సుదీర్ఘ పాద యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు..ప్రజలకు సుపరి పాలన అందించడం లో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ను తీసుకురావడం జరిగిందని, ప్రభుత్వ సేవలనుసులభతరం చేస్తూ గ్రామ స్థాయి లోని ప్రజలకు సేవలు అందించేలా సచివాలయ వ్యవస్థ తో పాటు రైతులకు అవసరమైన అధు నాతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసా య సాగు పద్దతుల పై అవగాహన కల్పించేందుకు రైతు భరోసా కేంద్రాలను, మెరుగైన వైద్య సేవలు అందించేందు కు డా.వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను నిర్మించడం జరుగుతున్నదని తెలిపారు. గర్భవతు లకు అవసరమైన పౌష్టికాహారంను అంగన్వాడీ కేంద్రాల ద్వారా డా.వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు ద్వారా అందజేస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులతో పాటు గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇలా ఒక గ్రామంలో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, డా. వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం ద్వారా ప్రజలు పొందే సేవలతో ఆ గ్రామం ముఖచిత్రం మారడంతో పాటు ప్రజలకు ప్రభుత్వం ద్వారా పొందే సేవలను పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతున్నదన్నారు.

         ఈ కార్యక్రమం లో జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జెడ్ పి సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, డి పి ఓ లక్ష్మి, ఐ సి డి ఎస్ పి డి నాగ శైలజ, తహశీల్దార్ చంద్రశేఖర్, ఎం పి డి ఓ వర ప్రసాద్, పంచాయతీ రాజ్ డి ఈ చంద్ర శేఖర్, ప్రజాప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.Comments