వారంలో మూడు రోజులు ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతి సాధించాలి

 వారంలో మూడు రోజులు ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతి సాధించాలి



జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 09 (ప్రజా అమరావతి):


వారంలో మూడు రోజులు ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతి సాధించాలిని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు

సోమవారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం నుంచి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, హౌసింగ్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ, హౌసింగ్, గడపగడపకు మన ప్రభుత్వం, స్పందన తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విసిలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 

హౌసింగ్ కి సంబంధించి జిల్లా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఉగాది నాటికి 10,750 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లాకి లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, కేటాయించిన లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జనవరి నెలకు కేటాయించిన లక్ష్యాన్ని ముందుగా పూర్తి చేయాలని, ఆర్ సి లో ఉన్న ఇళ్లు ప్లాస్టింగ్ చేయడం చేసి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, ఆర్ఎల్ లో ఉన్న వాటిని ఆర్సిలోకి తీసుకురావాలని, బేస్మెంట్ స్థాయిలో ఉన్నవి ఆర్ఎల్ లోకి తీసుకురావాలన్నారు. వేగంగా ఇళ్ల నిర్మాణం జరిగేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలకు సంబంధించి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, తదితర ప్రాధాన్యత ప్రభుత్వ భవనాలను ఈ నెలాఖరులోగా పూర్తయ్య దశలో ఉన్న నిర్మాణాలను వెంటనే వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆయా భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాన్ గ్రౌండింగ్ ఒకటి కూడా పెండింగ్ ఉండటానికి వీలులేదన్నారు.

జి జి ఎంపీ లో మంజూరైన పనుల బిల్ల్స్ ను వెంటనే ఆన్లైన్లో చేయండి అని ఎంపీడీవోలను ఆదేశించారు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాకు మొత్తం 79 లక్షల లేబర్ లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందని, ఇప్పటివరకు 66 లక్షల లేబర్ లక్ష్యాన్ని పూర్తి చేయగా, ఈనెలాఖరు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వంకు సంబంధించి మంజూరైన పనులను వేగవంతంగా చేపట్టాలని, అవసరమైన పనులకు శాంక్షన్ తీసుకోవాలని, పనులు వేగవంతంగా జరిగేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ పనులకు సంబంధించి అవసరమైన సిమెంట్ సిద్ధంగా ఉంచుకొనేందుకు ఆయా కంపెనీలతో మాట్లాడాలన్నారు. ఏపీ సేవా సర్వీసులకు సంబంధించి మరింత దృష్టి పెట్టి మరిన్ని సర్వీసులు అందించేలా కృషి చేయాలని, సచివాలయుల ద్వారా ఎక్కువ సర్వీసులను అందించాలన్నారు. ఏపీ సేవా సర్వీసులను బాగా అందిస్తున్న ఆయా మండలాల ఎంపీడీవోలను అభినందించారు. పురోగతి తక్కువగా ఉన్న మండలాల్లో సర్వీసుల్లో పురోగతి చూపించాలన్నారు. కోర్టు, కంటెంప్ట్ కేసులకు సంబంధించి పరిశీలించి వెంటనే వకాలత్, కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఎం.పి.ఎఫ్.సి (మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గోడౌన్ లకు సంబంధించి జిల్లాలో మూడో దశలో మంజూరైన గోడౌన్ లకు వచ్చే గురువారం నాటికి పెండింగ్ ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని తహసిల్దార్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందన గ్రీవెన్స్ పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఈనెల 15వ తేదీలోపు పెండింగ్ ఉన్న లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైస్ కార్డులకు సంబంధించి మెంబర్ ఎడిషన్ ప్రక్రియలో ఈ కేవైసీ లను వెంటనే చేయించాలని, క్షేత్రస్థాయిలో అంగన్వాడీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, డిఆర్డీఏ పిడి నరసయ్య, పిఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిసిఓ కృష్ణా నాయక్, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్, ఇంచార్జి డిఈఓ మీనాక్షి, ఆరోగ్యశ్రీ అధికారి యల్లప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments